ETV Bharat / state

వైద్యం కోసం గర్భిణి పాట్లు.. సాహసంతో మానవత్వం చాటిన 108 సిబ్బంది

author img

By

Published : Oct 11, 2020, 9:44 PM IST

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో 108 సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. పురిటి నొప్పితో బాధపడుతున్న మహిళను మూడు కిలోమీటర్లు స్ట్రెచర్​పై తీసుకువచ్చి అక్కడి నుంచి అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది సాహసానికి గిరిజనులు ధన్యవాదాలు తెలిపారు.

regency-lady-travel-three-kilometers-on-stretcher-for-treatment-at-kukkunuru-wast-godavari
వైద్యం కోసం గర్భిణి పాట్లు.. సాహసంతో మానవత్వం చాటిన 108 సిబ్బంది

ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం రామవరం గ్రామానికి చెందిన కలుము రాజి.. నిండు గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు రావడం వల్ల కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. స్పందించిన సిబ్బంది వెంటనే బయలుదేరారు. అయితే దారి సరిగ్గా లేక రామావరం గ్రామానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో బంజరగూడెం వరకే అంబులెన్స్​ వెళ్లింది.

మూడు కిలోమీటర్లు కాలినడక...

గ్రామానికి వెళ్లడానికి మరో దారిలేక సిబ్బంది స్ట్రెచర్​ తీసుకుని సుమారు మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. అప్పటికే గర్భిణి బంధువులు డోలి కట్టుకుని ఎదురుగా ఆమెను తీసుకొచ్చారు. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో వాహనం వరకు తీసుకెళ్లారు. అక్కనుంచి తెలంగాణలోని భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది కె.రమాదేవి, చంద్రశేఖర్​ను మహిళ కుటుంబ సభ్యులు అభినందించారు.

డోలి కట్టుకుని వెళ్లాల్సిందే...
ప్రభుత్వాలు ఎన్ని మారుతున్న గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ గ్రామాలకు నేటికి రహదారులు లేక నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు. అత్యవసర పరిస్థితి వస్తే డోలి కట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాల్సిన పరిస్థితి అని పేర్కొన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రహదారులు నిర్మించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదీ చూడండి: ఏకధాటిగా కురుస్తున్న వానలకు స్తంభించిన జనజీవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.