ETV Bharat / state

Recykal IOCL Pilot Project : ఇంట్లో ఉన్న చెత్తను ఇవ్వు.. ఉచితంగా పెట్రోల్​ పొందు.. - Free petrol

Refuel With Recykal In Hyderabad : ఇప్పుడు నగరంలో లీటరు పెట్రోల్​ ధర రూ.110 గా ఉంది. అదే పెట్రోల్​, డీజిల్​ ఫ్రీగా వస్తుంది అంటే ఎవరు తీసుకోరు చెప్పండి. ఆశ్చర్యంగా ఉంది కదూ.. మీరు విన్నది నిజమే పెట్రోల్​ ఫ్రీగా దొరుకుతుంది. అది కూడా ఏ అరబ్​ దేశమో కాదు.. హైదరాబాద్​లోనే. కానీ మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్​, పేపర్లు, ల్యాప్​టాప్​ వంటి చెత్తను వారి ఇవ్వాలి. ఇక మరేందుకు ఆలస్యం చెత్తను తీసుకురండి.. పెట్రోల్​ను తీసుకుపొండి అంటున్నాది ఓ అంకుర సంస్థ. అసలు ఆ అంకుర సంస్థ ఎక్కడ స్థాపించారు. అసలు ఎందుకు అలా చేస్తున్నారు అనే విషయంపై చర్చిద్దాం.

Recykal
Recykal
author img

By

Published : Jul 14, 2023, 7:18 PM IST

Recycling StartUp Company Gives Petrol To Garbage : రోజురోజుకూ మారుతున్న సాంకేతికతో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక సరికొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉంటున్నాయి. మరి ఆ టెక్నాలజీని వాడుకుంటూ.. పర్యావరణాన్ని కాపాడుకుంటూ.. ప్రజలకు ఉపయోగపడేలా ఇండియన్​ ఆయిల్​ సంస్థ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్​కు చెందిన అంకుర సంస్థ రిసైకల్​ తన వంతు సహకారాన్ని అందిస్తోంది. వీటి పని వినియోగదారుని నుంచి చెత్తను సేకరించి.. దానికి పరిహారంగా పెట్రోల్​ను ఇవ్వడమే. ఈ అవకాశం మరెక్కడో కాదండి బాబోయ్​.. మన భాగ్యనగరంలోనే ఫైలన్​ ప్రాజెక్టుగా ప్రారంభించారు.

Petrol Is Free Motorists Bring Garbage : గత నెల జూన్​ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్​ నగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు కూడా పెట్రోల్​, డీజిల్​పై తగ్గింపు లభిస్తుండటంతో ప్రజలు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. ఇంట్లో ఉన్న ఈ వేస్ట్​, పాత పేపర్లు, ప్లాస్టిక్​ వేస్ట్​ వంటి చెత్తను బయటపడేయకుండా నగరంలో ఎంపిక చేసిన ఇండియన్​ ఆయిల్​ పెట్రోల్​ బంకుల్లో ఉన్న రిసైకల్​ ప్రతినిధులకు ఇస్తే చాలు. అక్కడే మీరు అందుకు తగిన పెట్రోల్​ను వాహనంలో నింపుకోవచ్చు.

అసలు ఎలా రిజిస్ట్రేషన్​ అవ్వాలి : చెత్తను తీసుకొని ఇందుకోసం ఎంపిక చేసిన ఇండియన్​ ఆయిల్​ పెట్రోల్​ బంక్​లకు తీసుకువెళితే.. మొదట మీతో రీసైకల్​ ఎకౌంట్​ను ఓపెన్​ చేస్తారు. ఆ తర్వాత వారి యాప్​లో రిజిస్టర్​ చేస్తారు. రిజిస్టర్​ అయిన తర్వాత మీ ఎకౌంట్​లోకి ఉచితంగా కొన్ని క్రెడిట్​ పాయింట్లు అనేవి వస్తాయి. అలా వచ్చిన పాయింట్లతో అదే బంక్​లో పెట్రోల్​ లేదా డీజిల్​ కొట్టించుకోవచ్చు. లేకపోతే ఆ తర్వాత అయినాసరే వాటిని వినియోగించుకోవచ్చు. ఈ బంకుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రిసైకల్​ ప్రతినిధులు అందుబాటులో ఉంటారని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

Indian Oil Company Taking Garbage And Giving Petrol : ప్రస్తుతానికి పైలెట్​ ప్రాజెక్టుగా హైదరాబాద్​లో మాత్రమే ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. నగరంలో జూబ్లీహిల్స్​, హైటెక్​ సిటీ, మదీనాగూడ, బేగంపేట్​, ఐకియా.. ఇలా ఐదు ఇండియన్​ ఆయిల్​ పెట్రోల్​ బంకులలోనే ఈ సదుపాయం ఉందని నిర్వహకులు చెబుతున్నారు. భవిష్యత్తులో దేశమంతా వ్యాపిస్తామని తెలిపారు. ఇది వినియోగదారుడికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.