ETV Bharat / state

Hyderabad Metro: రాయితీలిస్తారా.. కిరాయిలు తగ్గిస్తారా? - Hyderabad metro fares

‘మెట్రోని మరింత సమర్థంగా నడిపించే దిశగా వినూత్న చర్యలకు పూనుకోవాలని’ సీఎం కేసీఆర్‌ ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులకు సూచించిన నేపథ్యంలో చర్చ మొదలైంది. దీనితో మళ్లీ మెట్రో ఛార్జీల తగ్గింపు తెరపైకి వచ్చింది.

Hyderabad Metro: రాయితీలిస్తారా.. కిరాయిలు తగ్గిస్తారా?

author img

By

Published : Jun 30, 2021, 9:29 AM IST

మెట్రో రైలు ఛార్జీల్లో రాయితీలు ప్రకటించే అవకాశం ఉందా? టిక్కెట్ల ధరల తగ్గింపు పథకాలకు తెరతీయబోతున్నారా? ‘మెట్రోని మరింత సమర్థంగా నడిపించే దిశగా వినూత్న చర్యలకు పూనుకోవాలని’ సీఎం కేసీఆర్‌ ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులకు సూచించిన నేపథ్యంలో చర్చ మొదలైంది. ఇదే సమయంలో స్టేషన్లలోనూ, మాల్స్‌లోనూ దుకాణాల అద్దెలు భారీగా ఉన్నాయమని తగ్గించాలన్న వినతులు వ్యాపారుల నుంచి విన్పిస్తున్నాయి. కొవిడ్‌ భయాలు తొలగకపోవడంతో ప్రస్తుతం చాలా తక్కువ మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. కొవిడ్‌ తొలి దశ అనంతరం మెట్రోని పునఃప్రారంభించినప్పుడు ఇలాగే ఉన్నారు. అప్పట్లో నాలుగు ఆకర్షణీయ పథకాలను ప్రకటించారు. మూడునెలల పాటు వర్తించేలా ప్రయాణికుల టిక్కెట్లలో, పాసుల్లో రాయితీలు ఇచ్చారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది.

రోజువారీ ప్రయాణికుల సంఖ్య లక్ష నుంచి రెండున్నర లక్షల వరకూ పెరిగింది. వేసవిలో మరింత పెరుగుతుందని అనుకుంటున్న దశలో ఏప్రిల్‌లో కొవిడ్‌ రెండో ఉద్ధృతితో ప్రయాణికులు తగ్గిపోయారు. మేలో కర్ఫ్యూ అమలుతో ఉదయం 7 నుంచి 10 గంటల వరకే సర్వీసులు నడిచాయి. ప్రయాణికుల సంఖ్య అత్యల్పంగా 4 వేలకు పడిపోయింది. ప్రస్తుత అన్‌లాక్‌లో వేళల్ని పొడిగించినా లక్షలోపే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సంఖ్య పెంచాలంటే మరోసారి ఛార్జీల్లో రాయితీ ఇవ్వక తప్పని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఆ తగ్గింపు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మెట్రో వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు. లీటరు పెట్రోలు/డీజీలు ధర ఏడాది కాలంలో రూ.20కి పైగా పెరిగింది. సొంత వాహనాల్లో ప్రయాణం భారమైంది. ఈ తరుణంలో ఏ మాత్రం తగ్గింపు ఇచ్చినా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో మొగ్గుచూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఎందుకు అవసరం?

ప్రయాణికుల రాకను బట్టే మెట్రో స్టేషన్లు, మాల్స్‌లో రిటైల్‌ వ్యాపారం ఆధారపడి ఉంది. ప్రయాణికుల టిక్కెట్లతో సమానంగా వీటి నుంచి ఆదాయం రావాలి. ఏడాదిగా ఏమాత్రం రావడం లేదు. దుకాణాలు అద్దెకు, లీజుకు తీసుకున్న వారి నుంచి ఎల్‌అండ్‌టీ మెట్రోపై ఒత్తిడి పెరుగుతోంది. రాయితీలతో టిక్కెట్ల ఆదాయంలో కొంత కోత పడినా.. మాల్స్‌, రిటైల్‌ నుంచి రాబట్టుకోవచ్ఛు ఇందుకు ప్రయాణికుల రాకపోకలు పెరగాలి. ఇప్పుడిప్పుడే కొత్త రిటైల్‌ దుకాణాలు స్టేషన్లలో తెరుచుకుంటున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ స్టేషన్‌లో ఇటీవల ఫుడ్‌కోర్డు ప్రారంభమైంది. ప్రయాణికులు పెరిగితే మరింతమంది దుకాణాలు తీసుకొనేందుకు ముందుకొస్తారు.

ఇవీ పరిశీలించవచ్చు

  • ప్రయాణికుల ఆదరణ పెంచేందుకు అనుసంధాన సర్వీసులను పునరుద్ధరించాలి.
  • స్టేషన్లలోని అన్నివైపుల మార్గాలను తెరవాలి. ప్రస్తుతం కొన్ని గేట్లనే తెరుస్తున్నారు.
  • రాత్రుళ్లు కనీసం 11 గంటల వరకూ సర్వీసులు అందుబాటులో ఉండాలి. ఉదయం 6కే ప్రారంభించాలి. కనీసం పావుగంటకు ఒక సర్వీసు నడిపినా ఉపయోగంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు.
  • స్టేషన్లలో రిటైల్‌ దుకాణాల అద్దెలు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్‌ వ్యాపారాలు పెరిగితే ప్రయాణికులు పెరుగుతారంటున్నారు.

రాకపోకలిలా..

  • 55 మెట్రో రైళ్లు మూడు మార్గాల్లో నడుస్తున్నవి
  • 1000: రోజు తిరిగే ట్రిప్పులు

ఇదీ చదవండి : కొవిడ్​ టీకాలపై గర్భిణులకు అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.