ETV Bharat / state

సాంకేతిక కళాశాలల్లో అధ్యాపకుల తగ్గింపు - సాంకేతిక కళాశాల అధ్యాపకుల తగ్గింపు

తెలంగాణలోని సాంకేతిక కళాశాలల్లో అధ్యాపకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత ఐదేళ్లలో సుమారు 22 వేల మందిని తొలగించారు. సీట్ల సంఖ్య తగ్గడం, యాజమాన్యాలు కళాశాలలను మూసేసుకోవడంతో పాటు విద్యార్థులు- అధ్యాపకుల నిష్పత్తిలో ఏఐసీటీఈ మార్పు చేయడం తదితర అంశాలు అధ్యాపకుల సంఖ్య తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

సాంకేతిక కళాశాలల్లో అధ్యాపకుల తగ్గింపు
సాంకేతిక కళాశాలల్లో అధ్యాపకుల తగ్గింపు
author img

By

Published : Jul 10, 2020, 10:25 AM IST

రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలల్లో అధ్యాపకుల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. గత ఐదేళ్లలో దాదాపు 22 వేల మంది అధ్యాపకుల కొలువులకు కోత పడింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సీట్ల సంఖ్య తగ్గడం, యాజమాన్యాలు కళాశాలలను మూసేసుకోవడంతో పాటు విద్యార్థులు- అధ్యాపకుల నిష్పత్తిలో ఏఐసీటీఈ మార్పు చేయడం తదితర అంశాలు అధ్యాపకుల సంఖ్య తగ్గడానికి కారణమని నివేదిక స్పష్టం చేసింది.

ఎందుకీ కోత

ఇంజినీరింగ్‌, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, ఎంసీఏ, పాలిటెక్నిక్‌, ఆర్కిటెక్చర్‌, డిజైన్‌, అప్లైడ్‌ ఆర్ట్‌ తదితర కోర్సులను అందించే కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి తప్పనిసరి. కొన్నేళ్ల కిందటి వరకు కొత్త కళాశాలలు భారీగా ఏర్పాటుకాగా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో.. జేఎన్‌టీయూహెచ్‌ మౌలిక వసతులపై కఠినంగా వ్యవహరించింది. దానికితోడు విద్యార్థులు నాణ్యంగా బోధించే కళాశాలల్లో ప్రవేశాలు పొందుతుండటం, ఇతర రాష్ట్రాల్లోని డీమ్డ్‌, ప్రైవేట్‌ వర్సిటీల్లో చేరుతుండటం వల్ల పలు కళాశాలల యజమానులు ఇక ప్రయోజనం లేదని వాటిని మూసేసుకుంటున్నారు. బీటెక్‌లో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలన్నది గతంలో నిబంధన ఉండేది. ప్రతి 20 మందికి ఓ అధ్యాపకుడు ఉండాలని ఏఐసీటీఈ 2018-19 నుంచి నిబంధనను మార్చింది. ఈ కారణాలతో సాంకేతిక కళాశాలల్లో అధ్యాపకుల సంఖ్య తగ్గినట్లయింది.

ఇవీ చూడండి: కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.