Red Bull Soapbox Race in Hyderabad : అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన రెడ్‌బుల్ సోప్‌బాక్స్ రేస్ భారతదేశంలో ముచ్చటగా మూడోసారి నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈసారి ఈ రేసులకు భాగ్యనగరం వేదిక కానుంది. 2024 మార్చి 03న ఔత్సాహికుల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఇది ఈవెంట్‌కు సంబందించి మూడో ఎడిషన్.. చివరి రెండు 2012, 2016లో ముంబయిలో జరిగాయి. వేగం, సృజనాత్మకత సహా నాన్ మోటరైజ్డ్ వాహనాల(Non-Motorized Vehicles) పోటీలతో ఆద్యంతం వినోదాన్ని ప్రేక్షకులకు పంచడం దీని ఉద్దేశం.
Red Bull Soapbox Race 2024 Schedule : బ్రెజిల్‌లోని బ్రస్సెల్స్‌లో ఈ పోటీలను మొట్ట మొదటిసారి నిర్వహించగా.. ఇప్పటి వరకు స్పెయిన్, ఇటలీ, యూకే, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలతో సహా 4.5 మిలియన్లకు పైగా ప్రేక్షకులతో 52 కంటే ఎక్కువ దేశాలు, 95 నగరాల్లో (138 ఈవెంట్‌లు) విస్తరించింది. రెండు పర్యాయాలు ముంబయి వేదికగా పోటీలు జరగగా ఎనిమిదేళ్ల తర్వాత భారత్‌లో.. హైదరాబాద్ నగరంలో తొలిసారిగా ఈ పోటీలు జరగనున్నాయి. సైబరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ వేదికగా(Inorbit Mall Venue) మార్చి నెలలో ప్రారంభ కార్యక్రమం జరగనుంది.
ఫార్ములా ఈ-రేస్.. ఎక్కడ మొదలైంది.. హైదరాబాద్‌కు ఎలా వచ్చింది..?
ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారికి ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం పలుకుతోంది. సోప్‌బాక్స్ రేసులను భారీ సన్నాహాల నడుమ అట్టహాసంగా జరిపేందుకు రెడ్‌బుల్ ప్రణాళిక రచిస్తోంది. సైబరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్లో వచ్చే ఏడాది మార్చి 3న ఉదయం 10 గంటల నుంచి జరపాలని షెడ్యూల్లో పేర్కొంది. మూడో ఎడిషన్ మునుపటి కంటే పెద్దదిగా.. మెరుగ్గా ఉంటుందని సంస్థ తెలుపుతోంది. ఈ రేసులో చాలా ఆవిష్కరణలు మెరవనున్నాయి.
3rd Soapbox Race Event in India : రెడ్‌బుల్ సోప్‌బాక్స్ రేస్‌లో పాల్గొనడానికి ఏకైక ఆవశ్యకత ఏమిటంటే.. ఈ ప్రపంచంలోని ఊహలకు దూరంగా ఉండటం. అసంబద్ధమైన, క్రేజీ ఆలోచనలను సోప్‌బాక్స్ కారులో చేర్చాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాలి. అన్ని ఇతర రేసుల మాదిరిగానే, జట్లు కూడా మూడు ముఖ్యమైన నియమాలను పాటించేలా చూసుకోవాలి. 1. స్టీరింగ్‌తో పాటు బ్రేక్‌లు పూర్తిగా పనిచేయాలి. 2.సోప్‌బాక్స్ బండిని నిర్మించడానికి ఎంతో సృజనాత్మకత అవసరం. 3. వాహనంలో వేగంగా రేసును ముగించే వ్యక్తి.. రేసును గెలవడానికి అనుకూలమైన ఆలోచన ధోరణిని కలిగివుండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం.. : ఈ పోటీల్లో పాల్గొనేవారు చిన్న సైజ్‌లో నాన్ మోటరైజ్డ్ వాహనాలను రూపొందించుకోవాలి. ఆ వాహనాలకు బ్రేకింగ్ వ్యవస్థతో(Breaking System) పాటు స్టీరింగ్ పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. వాహన తయారీలో వైవిధ్యం, సృజనాత్మకత కనిపించాలి. https://www.redbull.com/inen/events/red-bullsoapboxrace-india-2024 వెబ్‌సైట్ లింక్ ద్వారా పోటీదార్లు వివరాలు నమోదు చేయాలి. అనంతరం వాహనానికి సంబంధించిన స్కెచ్, థీమ్ మొదలగు వివరాలను అప్‌లోడ్ చేయాలి. అన్నీ సరిగ్గా ఉంటే మీకు కూడా ఈ వినూత్న పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది.
ఆసియాలోనే అతిపెద్ద సైకిల్ రేస్.. 12 రోజుల్లో కశ్మీర్ టు కన్యాకుమారి!
హైదరాబాద్ జాన్.. దేఖో 'ఫార్ములా-ఈ' రేసింగ్.. ఆంథెమ్ సాంగ్‌తో అదరగొట్టిన తమన్