power demand increased today in telangana : రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగినట్లు విద్యుత్ శాఖ ప్రకటించింది. ఇవాళ ఉదయం 10.03 నిమిషాలకు 15,062 మెగా వాట్ల విద్యుత్ అత్యధిక పీక్ డిమాండ్ నమోదైందని తెలిపారు. ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగంగా విద్యుత్ శాఖ వెల్లడించింది. సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడం, వేసవి కావడంతో ఇళ్లల్లో కూడా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది.
Power consumption increased in Telangana today : మొత్తం వినియోగంలో వ్యవసాయ రంగానికి 37శాతం వాడుతుండగా.. మిగిలిన విద్యుత్‌ను పారిశ్రామిక, ఇంకా తక్కిన రంగాలకు వినియోగిస్తున్నారు. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా రెండో స్థానం లో తెలంగాణ రాష్ట్రం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిన్న 14,138 మెగావాట్లు కాగా.. రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,062 మెగా వాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి.
గత సంవత్సరం మార్చి నెలలో 14,160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా.. ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్ ను అధిగమించింది. ఈనెలలోనే 14,750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి 15,062 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదు అయ్యింది. ఈ సంవత్సరం వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నట్లు విద్యుత్ శాఖ అభిప్రాయపడుతుంది.
ఎంత డిమాండ్ వచ్చినా సరఫరాకు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. మార్చి నెలలో 15,000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుంది అని ముందే ఉహించామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. రాష్ట్ర రైతులకు, అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎండీ ప్రభాకర్ రావు స్ఫష్టం చేశారు.
రాష్ట్రంలో పెరగని విద్యుత్ ఛార్జీలు: ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెరగవని గతేడాది డిసెంబర్లోనే రాష్ట్రంలోని విద్యుత్‌ను పంపిణీ చేసే రెండు డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలిని కోరాయి. ఇందుకు విద్యుత్ మండలి సైతం ఓకే చెప్పింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ ఛార్జీలనే పెంచకుండా యథాతథంగా కొనసాగిస్తున్నాయి.
ఇవీ చదవండి: