ETV Bharat / state

వేడెక్కుతున్న రాష్ట్రం... రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు - telangana temperatures updates

తెలంగాణలో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా నమోదవుతున్నాయి. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వస్తున్న గాలులతో రాష్ట్రం వేడెక్కుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ దాటే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

వేడెక్కుతున్న రాష్ట్రం... రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

author img

By

Published : Mar 1, 2021, 6:57 AM IST

అప్పుడే రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలైంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా నమోదవుతున్నాయి. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వస్తున్న గాలులతో రాష్ట్రం వేడెక్కుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పగలు ఎండ, రాత్రి వేడిగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోతతో విద్యుత్తు వినియోగం పెరగడంతో డిమాండ్‌ రికార్డు స్థాయికి చేరింది. అధిక వేడి ప్రభావం పంటల దిగుబడిపైనా ఉండే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పది రోజుల కిందట రోజువారీ డిమాండు 10 వేల మెగావాట్లు ఉండగా ప్రస్తుతం 13,200 మెగావాట్లకు చేరుకుంది. వేసవి ఎండల తీవ్రత ఇక మొదలైందని, ఉక్కపోతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

39 డిగ్రీలకు పైగానే...

రాష్ట్రంలో ఆదివారం గరిష్ఠంగా ఖమ్మం జిల్లా కూసుమంచిలో 39.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా ఫిబ్రవరిలో ఈ జిల్లాలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. 2017 ఫిబ్రవరి 21న ఇక్కడ 37.8 డిగ్రీలు నమోదైంది. నల్గొండ జిల్లా మునుగోడులో 39.6 డిగ్రీలు నమోదుకాగా 2016 ఫిబ్రవరి 21న ఈ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలుగా ఉంది. భద్రాచలంలో ఆదివారం 39.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా 2012 ఫిబ్రవరి 27న 38.7 డిగ్రీలుగా నమోదైంది. మంచిర్యాల, జగిత్యాల, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈసారి 45 డిగ్రీలు..

ఈసారి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ దాటే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది సాధారణం కన్నా 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ సెల్సియస్‌ అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణ కోర్‌ హీట్‌వేవ్‌ జోన్‌లో ఉన్నట్లు భారత వాతావరణశాఖ పేర్కొంది. దీనివల్ల నడి వేసవిలో సూర్యకిరణాల తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా ఆదేశించారు.

‘ఈ ఏడాది ఉత్తర తెలంగాణతో పాటు పలుచోట్ల ఉష్ణోగ్రత గరిష్ఠంగా 45 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మార్చి రెండోవారం నుంచి ఎండలు పెరుగుతాయి. ఈ ఏడాది కొంత వేడిగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి’. అని హైదరాబాద్‌ వాతావరణ శాఖ డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు.

ఇదీ చూడండి: నేటి నుంచి కొ-విన్​2.0 పోర్టల్​ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.