ETV Bharat / state

RBI COMMITTEE: 'వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్​ను రూ.51,560 కోట్లకు పెంచాలి'

రాష్ట్రాలకు రిజర్వు బ్యాంక్​ అందించే వేస్​ అండ్​ మీన్స్​ అడ్వాన్స్​ను 47,010 కోట్ల రూపాయల నుంచి 51,560 కోట్లకు పెంచాలని ప్రత్యేక కమిటీ సూచించింది. రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ నివేదికను సభ్యులు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్​కు అందించారు.

RBI COMMITTEE: 'వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్​ను రూ.51,560 కోట్లకు పెంచాలి'
RBI COMMITTEE: 'వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్​ను రూ.51,560 కోట్లకు పెంచాలి'
author img

By

Published : Sep 5, 2021, 2:30 AM IST

రాష్ట్రాలకు ఇచ్చే వేస్ అండ్ మీన్స్ పరిమితులపై రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ నివేదికను సభ్యులు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్​కు అందించారు. మహారాష్ట్ర విశ్రాంత అదనపు సీఎస్ సుధీర్ శ్రీవాత్సవ నేతృత్వంలో ఆర్బీఐ గతంలో కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కమిటీలో ప్రధాన సభ్యులుగా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, అసోం, ఒడిశా రాష్ట్రాల ఆర్థికశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. కమిటీ నివేదికను రామకృష్ణారావు ఇవాళ సీఎస్ సోమేశ్ కుమార్​కు అందించారు. కొవిడ్ ప్రభావం రాష్ట్రాలపై ప్రత్యక్షంగా ఉన్నందున వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్​ను 47,010 కోట్ల రూపాయల నుంచి 51,560 కోట్లకు పెంచాలని కమిటీ సూచించింది. ఆర్బీఐ విధానాలకు అనుగుణంగా వడ్డీ రేట్లను లింక్ చేస్తూ సవరించాలని కోరింది. స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం వడ్డీ రెపో రేటు కంటే రెండు శాతం తక్కువగా ఉండాలని... వేస్ అండ్ మీన్స్ రెపో రేటునే వడ్డీగా విధించాలని సూచించింది. స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం పొందడానికి రాష్ట్రాలు 91 రోజుల ట్రెజరీ బిల్లులపై పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనను తొలగించాలని సిఫారసు చేసింది.

సీఎస్ఎఫ్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కాలపరిమితిని ఐదేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలని సూచించింది. కమిటీ నివేదికను రిజర్వ్ బ్యాంక్ జూలై నెల నుంచి అమలు చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు వనరుల లభ్యత పెరిగి ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు చేసేందుకు వీలు కలిగింది. రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేలా నివేదిక ఇచ్చినందుకు ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అభినందించారు.

ఇదీ చదవండి: KCR Delhi tour : ఐపీఎస్‌ క్యాడర్ రివ్యూ చేపట్టాలని అమిత్​షాకు కేసీఆర్ వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.