ETV Bharat / state

తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన రాయచోటి వైకాపా నేత! - తెలంగాణ వార్తలు

కడప జిల్లా వైకాపా నాయకుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి.. తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన త్వరలో తెదేపాలో చేరే అవకాశమున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

rayachoti ycp leader met chandrababu, ap politics
చంద్రబాబును కలిసిన రాయచోటి వైకాపా నేత, ఏపీ పాలిటిక్స్
author img

By

Published : Apr 10, 2021, 2:26 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న చంద్రబాబుతో శ్రీకాళహస్తిలో ఆయన భేటీ అయ్యారు. ఆయన త్వరలో తెదేపాలో చేరే అవకాశమున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రామ్‌ప్రసాద్‌రెడ్డి తండ్రి నాగిరెడ్డి గతంలో రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి రాయచోటి శాసనసభ్యునిగా గెలుపొందారు.

రామ్‌ప్రసాద్‌రెడ్డి 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైకాపాలో చేరారు. 2019 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ ఆశించారు. రాయచోటి ఎమ్మెల్యే, చీఫ్​ విప్‌ శ్రీకాంత్‌రెడ్డితో ఆయనకు విభేదాలున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆయన తెదేపాలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: ఎన్నికల వేళ బలగాల కాల్పులు - నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.