హైదరాబాద్‌లో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా, స్వీయ నియంత్రణ పాటించని సూపర్ మార్కెట్లు, దుకాణాలపై జీహెచ్ఎంసీ కొరడా ఝళిపిస్తోంది. మొన్న ఎల్బీ నగర్‌లోని డీ మార్ట్‌ను సీజ్ చేసిన అధికారులు తాజాగా అమీర్ పేట్ శ్రీనగర్ కాలనీలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌ను సీజ్ చేశారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన జీహెచ్ఎంసీ నిఘా పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ అధికారులు... మార్ట్ సిబ్బంది, కస్టమర్లు భౌతిక దూరం పాటించకపోవడం గుర్తించారు. వినియోగదారులకు సరైన శానిటైజర్లు అందుబాటులో ఉంచకపోవడం గుర్తించిన అధికారులు నేడు మార్కెట్‌ను సీజ్ చేశారు.