ETV Bharat / state

రాష్ట్రానికి ర్యాపిడ్ రైలు - గంటలో హైదరాబాద్​ నుంచి ఎక్కడికైనా గంటలో వెళ్లొచ్చు!

Rapid Rail in Telangana in 2047 : తెలంగాణ వాసులారా.. రాబోయే కాలంలో హైదరాబాద్ నుంచి గంటలోనే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చట. అదెలా సాధ్యమంటారా.. రయ్​రయ్​మని హైస్పీడ్​తో పరుగులు తీసే ర్యాపిడ్ రైల్​తో సాధ్యమట. ఈ ర్యాపిడ్ రైలును రాబోయే పదేళ్లలో రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.

Metro Expansion In Telangana
Minister KTR On Transportation Expansion in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 2:46 PM IST

Rapid Rail in Telangana in 2047 : తెలంగాణలో దూరప్రాంతాలకు వేగవంతమైన ప్రజా రవాణా సదుపాయాల కల్పనపై బీఆర్ఎస్ తమ ప్రణాళికలు వెల్లడించింది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా గంట వ్యవధిలో చేరుకునేలా ర్యాపిడ్ రైల్ ట్రాన్సిల్ కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఐటీ రంగాన్ని.. చిన్న పట్టణాలకు విస్తరించేందుకు ఇది దోహదం చేస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం ఆయన 2047 హైదరాబాద్ విజన్ ప్రజెంటేషన్​లో ఈ కారిడార్ల గురించి చెప్పారు. నగరంలో ఓఆర్ఆర్ వరకు మెట్రో.. అక్కడి నుంచి ర్యాపిడ్ రైల్ తీసుకొస్తామని పేర్కొన్నారు.

Transport Expansion in Telangana : తెలంగాణలో ప్రజా రవాణా సదుపాయాలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. 2047 విజన్​తో ప్రజా రవాణాకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే ప్రజలకు ఆకర్షించే విధంగా మెట్రోలో మార్పులు తీసుకువచ్చారు. తెలంగాణలోని చాలా జిల్లాల ప్రజలు హైదరాబాద్​లో ఉపాధి పొందుతున్నారు. ప్రజా రవాణా విస్తరణ వల్ల వారికి చాలా ఉపయోగం చేకూరుతుంది.

యువతకు కూరగాయలు అమ్మే ఉద్యోగాలు - కాంగ్రెస్​ ఇచ్చే జాబ్స్​ ఇవేనా : మంత్రి కేటీఆర్​

Metro Expansion In Telangana : ప్రజా రవాణాకు సంబంధించి మొదలు హైదరాబాద్ నుంచి విజయవాడ (దాదాపు 250 కిలో మీటర్లు) గంటన్నరలో చేరుకునేలా ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రభుత్వం చేపట్టనుంది. దీనివల్ల రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు గొప్ప మలుపు అవుతుందని పేర్కొంది. రోజుకు విజయవాడ - హైదరాబాద్ మధ్య వందలాది మంది ప్రయాణిస్తుంటారు. కాగా మొదటి అయిదేళ్లలో 250 కిలో మీటర్లు.. రాబోయే పదేళ్లలో 415 కిలో మీటర్ల మెట్రో విస్తరణ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీకి మాత్రమే నిరుద్యోగం - రాజకీయ ఉద్యోగం కోసమే ఆ పార్టీ ఆరాటం : మంత్రి కేటీఆర్

ఇల్లు కొనుగోలు చేసే మధ్య తరగతి ప్రజలకు త్వరలోనే గొప్ప శుభవార్త : మంత్రి కేటీఆర్

1. శామీర్​పేట (ఓఆర్ఆర్) - గజ్వేల్ - కొమరవెల్లి - సిద్దిపేట - కరీంనగర్ - 140 కిలో మీటర్లు.

2. ఘట్​కేసర్ (ఓఆర్ఆర్) - బీబీనగర్ నుంచి యాదాద్రి, జనగాం, రఘనాథపల్లి, స్టేషన్ ఘన్​పూర్ - వరంగల్ 113 కిలో మీటర్లు.

3. పెద్ద అంబర్‌పేట(ఓఆర్‌ఆర్‌)

ఎ) చౌటుప్పల్‌ నుంచి చిట్యాల్‌- నార్కట్‌పల్లి, నల్గొండ 81 కిలో మీటర్లు.

బి) నార్కట్‌పల్లి, నరిరేకల్‌- సూర్యాపేట, కూసుమంచి, ఖమ్మం 111 కిలో మీటర్లు.

4. శంషాబాద్‌ (ఓఆర్‌ఆర్‌)- షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ 50 కిలో మీటర్లు.

5. అప్పా (ఓఆర్‌ఆర్‌)- మొయినాబాద్‌, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్‌ 60 కిలో మీటర్లు.

6. ముత్తంగి(ఓఆర్‌ఆర్‌)- ఇస్నాపూర్‌, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌ 64 కిలో మీటర్లు.

7. కండ్లకోయ (ఓఆర్‌ఆర్‌)

ఎ) మేడ్చల్‌-మనోహరాబాద్‌, మాసాయిపేట, చేగుంట, మెదక్‌ 70 కిలో మీటర్లు.

బి) చేగుంట-రామాయంపేట, బిక్‌నూర్‌, కామారెడ్డి, డిచ్‌పల్లి, నిజామాబాద్‌ 103 కిలో మీటర్లు.

తెలంగాణకు కాళేశ్వరం కల్పతరువు - రాజకీయాల కోసం బద్నాం చేయొద్దు : కేటీఆర్

'కొత్త సీసాలో పాత సారా లాంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.