ముషీరాబాద్ నియోజకవర్గంలో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు నిరాడంబరంగా చేసుకున్నారు. నియోజకవర్గంలోని రామ్ నగర్, ముషీరాబాద్, భోలక్ పూర్, అడిక్‌మెట్, గాంధీనగర్, కవాడిగూడ డివిజన్లలో... రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. కొవిడ్ వ్యాప్తి కారణంగా ఇళ్లలోనే ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు.
కుల మతాలకతీతంగా పండుగలు చేసుకోవడం భాగ్యనగర్ వాసులకు ఆనవాయితీగా మారిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు ముఠా జై సింహ, మహమ్మద్ అలీ, వై శ్రీనివాస్, షరీఫ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లు అడ్డుకోవద్దు: జగ్గారెడ్డి