ఉచితంగా నీటి సరఫరా ఇస్తామని చెప్పి మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసులను మోసం చేశారని బోర్డు సభ్యుడు రామకృష్ణ పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు నీటి బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీలో మాదిరిగానే ఇక్కడ కూడా నీటి సరఫరాను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:రైతులకు మద్దతుగా ఆర్.నారాయణమూర్తి సినిమా