సమస్యల పరిష్కారంలో స్థానిక కార్పొరేటర్ ఘోరంగా విఫలమయ్యారని రాంనగర్ డివిజన్ భాజపా అభ్యర్థి రవి చారి ఆరోపించారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంనగర్ డివిజన్లోని రిసలా, హరి నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు.
ఇదీ చదవండి: 'తెలంగాణను అభివృద్ధి చేసినందుకు చార్జిషీట్ వేస్తారా?'