ETV Bharat / state

"పాపం ఎవరిది మేయర్​.." సాంగ్​తో మరోసారి వార్తలో నిలిచిన ఆర్జీవీ - Ram Gopal Varma Song on Hyderabad Nagar Mayor

Ram Gopal Varma Song on Hyderabad Nagar Mayor: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తలోకి ఎక్కాడు. హైదరాబాద్​ అంబర్​పేట్​లో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై గతంలో స్పందించిన ఆయన.. తాజాగా హైదరాబాద్​ మేయర్​ను ఉద్దేశించి ఓ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్​లో "పాపం ఎవరిది మేయర్​.." అంటూ ప్రశ్నించారు. ఈ పాటను ఆయన ట్విటర్​ అకౌంట్​లో విడుదల చేశారు.

Ramgopala Varma
Ramgopala Varma
author img

By

Published : Mar 11, 2023, 10:22 PM IST

Updated : Mar 11, 2023, 10:29 PM IST

Ram Gopal Varma Song on Hyderabad Nagar Mayor: ఎప్పుడు సోషల్​ మీడియాలో వివాదాస్పాద పోస్టులు పెడుతూ ట్రెండ్​ అయ్యే సినీ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ మరోసారి వార్తలోకి ఎక్కాడు. ఇటివలే హైదరాబాద్​లోని అంబర్​పేట్​లో వీధికుక్కలపై దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై ఘాటుగా స్పందించిన ఆయన.. హైదరాబాద్ నగర​ మేయర్​ గద్వాల్‌ విజయలక్ష్మిపై ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికి తెలిసిన విషయమే. దీనికి ఆమె కూడా ఘాటుగానే స్పందించి వివరణ ఇచ్చారు.

తాజాగా రామ్ గోపాల్​ వర్మ​ మరోసారి వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడ్ని నేపథ్యంలో తీసుకొని ఓ సాంగ్​ను విడుదల చేశారు. "అడుక్కుతిన్న పన్నులన్నీ మింగిన మీరు.. మొరిగించి.. కరిపించి.. చంపించారు" అంటూ మొదలయ్యే ఈ సాంగ్​ "పాపం ఎవరిది మేయర్​.. ప్రాణం ఎవరిది మేయర్"​ అంటూ సాగిపోతుంది. ఈ వీడియోను ఆయన తన సోషల్​ మీడియా ఫ్లాట్​ ఫాం ట్విటర్​ ద్వారా విడుదల చేయగా మంచి ఆదరణ లభిస్తోంది. మంచి బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తో సాగిపోయే ఈ సాంగ్​ మరోసారి అంబర్​పేట్​ ఘటన​పై రామ్​గోపాల్​ వర్మ ప్రశ్నించినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా సాంగ్​లో ఇటీవలే వీధి కుక్కల దాడిలో గాయపడిన చిన్నారుల వీడియోలు ఉన్నాయి.

ఇది వరకే హైదరాబాద్​లో వీధి కుక్కల దాడుల గురించి ప్రశ్నించిన ఆర్జీవీ హైదరాబాద్​ మేయర్​ విజయలక్ష్మీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఆమె తన పెంపుడు కుక్కకు భోజనం పెడుతున్న వీడియోను షేర్​ చేస్తూ హైదరాబాద్​లో ఉన్న 5లక్షల కుక్కలన్నీటిని మేయర్​ ఇంట్లో విడిచిపెట్టాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎప్పుడు వివాదాస్పాద పోస్టులు పెడుతూ వార్తల్లో నిలిచే ఆర్జీవీ ఓ ఇంటర్య్వూలో తన జీవితంలో ఎప్పుడు బాధపడలేదని.. కానీ అంబర్​పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి చెందిన వీడియో బాగా కలిచివేసిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇది ఇలా ఉండగా.. అంబర్​ పేటలో జరిగిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. బాలుడు కుటుంబానికి మంత్రి కేటీఆర్​ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకోడదని విచారం వ్యక్తం చేశారు. జీహెచ్​ఎంసీ తరుపున బాలుడు కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం అందజేశారు. ఆ తరువాత జీహెచ్​ఎంసీ మేయర్​ ఆధ్వర్యంలో అన్ని పార్టీల కార్పొరేట్లతో మీటింగ్​ ఏర్పాటు చేసి వీధి కుక్కల నివారణకు తగు చర్యలు తీసుకోనేందుకు చర్చించారు. కుక్కల నివారణకు అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వాటి నివారణకు ఎప్పటికప్పుడు టీకాలు వేస్తూ సంతోనోత్పత్తి నివారణకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

'కుక్కలకు ఆకలి వేసి కరుస్తున్నాయంటూ ఎలా మాట్లాడతారు..?'

నాలుగేళ్ల పసివాడు.. కుక్కల దాడిలో బలయ్యాడు

విశ్వనగరంలో ఈ స్థాయిలో వీధి కుక్కల బెడదకు కారణాలేంటి?

Last Updated : Mar 11, 2023, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.