Raksha Bandhan Telangana 2023 : సోదర, సోదరీమణుల మధ్య.. ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండగ. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును కలిసేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు రక్షా బంధన్ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రభుత్వం ఎప్పుడు మహిళలకు అండగా ఉంటుందని, వారి భద్రత, రక్షణ, సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని హరీశ్ రావు తెలిపారు.
Rakhi Pournami Telangana 2023 : మరోవైపు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్లారెడ్డి సోదరీమణులు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు తినిపించారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి శోభ సంతరించుకుంది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి.. నియోజకవర్గంలో మహిళలు తరలివచ్చి రాఖీ కట్టారు.
Raksha Bandhan Gift Ideas : రాఖీ పండక్కి గిఫ్ట్ కొనాలా..? కేవలం 100 రూపాయల్లో బెస్ట్ ఐడియాస్!
-
అమ్మ లోని మొదటి అక్షరం
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
నాన్న లోని చివరి అక్షరం నా “ అన్న ”@KTRBRS #Rakshabandhan pic.twitter.com/qbSCZOBlbg
">అమ్మ లోని మొదటి అక్షరం
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 31, 2023
నాన్న లోని చివరి అక్షరం నా “ అన్న ”@KTRBRS #Rakshabandhan pic.twitter.com/qbSCZOBlbgఅమ్మ లోని మొదటి అక్షరం
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 31, 2023
నాన్న లోని చివరి అక్షరం నా “ అన్న ”@KTRBRS #Rakshabandhan pic.twitter.com/qbSCZOBlbg
MLC Kavitha Rakhi Wishes to KTR : మరోవైపు ఎమ్మెల్సీ కవిత తన సోదరులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం నా “ అన్న ” అని ట్విటర్ ఖాతాలో పోస్టు పెట్టారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరోవైపు కవిత.. తన సోదరుడు, ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్‌కు రాఖీ కట్టారు. రాఖీ సోదరిణుల ప్రేమకు చిహ్నమని ఎంపీ సంతోశ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ కవితతో పాటు తన సోదరి సౌమ్య.. తనకు రాఖీ కడుతున్న ఫొటోను ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
-
Forever grateful to be blessed with best brothers.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Happy Raksha Bandhan❤️ https://t.co/caqkjPApc0 pic.twitter.com/fpG2njW8W1
">Forever grateful to be blessed with best brothers.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 31, 2023
Happy Raksha Bandhan❤️ https://t.co/caqkjPApc0 pic.twitter.com/fpG2njW8W1Forever grateful to be blessed with best brothers.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 31, 2023
Happy Raksha Bandhan❤️ https://t.co/caqkjPApc0 pic.twitter.com/fpG2njW8W1
MLA Seethakka Ties Rakhi To Revanth Reddy : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి.. ములుగు ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టి సోదరప్రేమను చాటుకున్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి... పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు.
-
రక్షా అను”బంధం”#RakshaBandhan2023 https://t.co/uKlP7TjQay
— Revanth Reddy (@revanth_anumula) August 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">రక్షా అను”బంధం”#RakshaBandhan2023 https://t.co/uKlP7TjQay
— Revanth Reddy (@revanth_anumula) August 31, 2023రక్షా అను”బంధం”#RakshaBandhan2023 https://t.co/uKlP7TjQay
— Revanth Reddy (@revanth_anumula) August 31, 2023
Telangana Political Leaders Raksha Bandhan 2023 : హైదరాబాద్ శివారు శామీర్‌పేట్ నివాసంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు.. బీజేపీ మహిళా నేత తుల ఉమ సహా పలువురు రాఖీలు కట్టారు. మహబూబాబాద్‌లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ సమాజంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు.. బ్రహ్మకుమారీలు రాఖీ కట్టారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్న ఇంట రక్షా బంధన్ వేడుకల సందడి నెలకొంది. ఉదయమే ఆయన తన సోదరి చేత శాస్త్రోక్త పూజల నడుమ రాఖీ కట్టించుకున్నారు. అనంతరం అభిమానులు, బ్రహ్మ కుమారీలు, పార్టీ శ్రేణులు తరలివచ్చి రాఖీలు కట్టారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల జిల్లా పరిషత్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకల సందర్భంగా చంద్రయాన్-3ని విజయవంతం చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. విద్యార్థులు వినూత్నత చాటుకున్నారు. ఇస్రో తయారు చేసిన చంద్రయాన్-3 మిషన్ ఆకారంతో అతిపెద్ద రాఖీని తయారు చేసి విద్యార్థులు ప్రదర్శనకు ఉంచారు. ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రో ఛైర్మన్‌కు కానుకగా పంపిస్తున్నట్లు పాఠశాల విద్యార్థినిలు,ఉపాధ్యాయులు తెలిపారు. రాఖీ పండుగ వేళ ఆర్టీసీ బస్టాండ్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునుంచే ప్రయాణికులు బస్టాండ్ కు చేరుకోవడంతో రద్దీ నెలకొంది.
Celebrities Rakhi Celebration : అనుపమ టు మృణాల్.. తోబుట్టువులతో అనుబంధాన్ని పంచుకున్నారిలా..