Rajendra Nagar PS awarded Best Police Station in India : దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పీఎస్‌గా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(Ministry of Home Affairs) 2023 సంవత్సరానికి దేశంలోనే అత్యుత్తమ పోలీస్స్టేషన్ల జాబితాను ప్రకటించింది. అందులో భారతదేశంలో ఉన్న దాదాపు 17 వేలకు పైగా ఉన్న పోలీస్స్టేషన్లలో రాజేంద్రనగనర్ పోలీస్‌స్టేషన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
కానిస్టేబుల్ పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరించిన హైకోర్టు ధర్మాసనం
జైపూర్‌లో జరిగిన అన్నిరాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah)చేతుల మీదుగా రాజేంద్రనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(Station House Officer) బి.నాగేంద్రబాబు ట్రోఫీని అందుకున్నారు. దీని పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అధికారులను అభినందనలు తెలిపారు. ఈ జాబితాలో ద్వితీయ, తృతీయ బహుమతులను కశ్మీర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు గెలుచుకున్నాయి.
పోలీస్స్టేషన్ల పనితీరు ఆధారంగా వివిధ రకాల ప్రామాణికాలను పరిశీలించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ బహుమతులను ప్రకటించింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కేసుల దర్యాప్తు తీరు ఆధారంగా పోలీస్‌స్టేషన్ భవన నిర్వహణ తదితర అంశాలు ఆధారంగా ఈ ట్రోఫీకి ఎంపిక చేశారు. మహిళలపై కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ వంటి పలు అంశాలను కేంద్రహోం మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించి ఈ బహుమతులను ప్రకటించారు.
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి : రాచకొండ సీపీ
Rajendra Nagar PS Receives MHA Award : సీసీటీఎన్ఎస్ ద్వారా రెండవ దశలో 75 పోలీస్ స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేసి చివరకు దేశంలోనే రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌ను అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. శుక్రవారం నాడు జైపూర్‌లో జరిగిన డీజీపీల(DGP)సదస్సులో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు మొదటి బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ రవి గుప్తా అభినందించారు.
MHA Best PS Award : ఇటీవల రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో ఉందని తెలుసుకున్న డీజీపీ రవి గుప్తా(DGP Ravi Gupta), అడిషనల్ డీజీపీ శిఖా గోయల్‌లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, నాటి డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, తదితరులను అభినందించారు.
'దమ్ముంటే నా ఇంటిపై బాంబులు విసరండి'- ఉగ్రసంస్థకు DGP ఛాలెంజ్- సవాల్‌కు రెడీ అంటూ తీవ్రవాదుల ప్రకటన