రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని ప్రకటించారు. 17 లోక్‌సభ స్థానాల పరిధిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. 35 ప్రాంతాల్లో 126 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 7, సికింద్రాబాద్‌లో 6 సెగ్మెంట్లలో లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు. ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుందని ఈసీ వెల్లడించారు.
ఇదీ చూడండి: సార్వత్రిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం