సమాచార సేకరణలో అధికారులు..
ఇప్పటి వరకూ జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ తర్వాత ఉన్న తాజా వివరాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖను అడిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 52 లక్షల మందికి కొత్త పాసు పుస్తకాలు ఇచ్చినట్లు గుర్తించారు. ఇంకా పాసు పుస్తకాలు అందని రైతులు 3 లక్షల మంది పైగా ఉన్నారని తేల్చారు.
వారసుల పేరుతో ఉంటేనే....
గత ఏడాది ఖరీఫ్‌లో చెక్కులు ముద్రించిన తర్వాత కొందరు రైతులు కన్ను మూశారు. మృతుల వారసుల పేరిట భూ యాజమాన్య హక్కులు మారి కొత్త పాసు పుస్తకాలు పంపిణీ అయితేనే రైతుబంధు పథకం వర్తిస్తుంది. ఒకసారి రైతు పేరుతో చెక్కు ముద్రించిన తర్వాత అతను మరణిస్తే అదే చెక్కును వాసరులకు ఇవ్వడం కుదరదని, మళ్లీ నామినీ పేరు ముద్రించి ఇవ్వాలని వ్యవసాయ శాఖకు బ్యాంకులు స్పష్టం చేశాయి. రైతుబంధు, రుణమాఫీ పథకాల అమలుపై ఈ నెల 12న జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో చర్చిస్తామని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి:లీటర్ పెట్రోల్ ఉచితం...మహిళ దినోత్సవ ఆఫర్