నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆరుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఈ నెల 21వ తేదీన ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర అండమాన్ సముద్రం దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. కిందిస్థాయి గాలులు తెలంగాణలోకి నైరుతి దిశ నుంచి వీస్తున్నాయని తెలిపింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ రోజు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: 18 రోజుల్లో 4 శాతానికి పైగా దిగువకు కరోనా కేసులు