నివర్ తుపాను ప్రభావంతో హైదరాబాద్లో శుక్రవారం రాత్రి నుంచి వర్షం పడుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. నగరంలో చలి పెరిగింది. తీరం దాటిన తుపాను బలహీనపడిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. బంగాళాఖాతం పశ్చిమ ప్రాంతంలో అల్పపీడనం ఉంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది.
మరోవైపు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో అండమాన్ దీవుల వద్ద మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆదివారానికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇది తీవ్ర వాయుగుండంగా మారి వచ్చే నెల 2 నాటికి తమిళనాడు, పుదుచ్చేరి తీరం వద్దకు వచ్చే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి : దారుణం: భర్తపై అనుమానంతో భార్య యాసిడ్ దాడి