హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. త్రీవ వేడితో అల్లాడుతున్న ప్రజానీకానికి జల్లులు కాస్త ఉపశమనాన్ని కలిగించాయి. నారాయణ గూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, లక్డీకపూల్, బషీర్ బాగ్, అబిడ్స్ , నాంపల్లి తదితర ప్రాంతాల్లో వాన పడింది. కుషాయిగూడ, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి, నాగారం, దమ్మాయి గూడలో ఒక్కసారిగా చిరుజల్లులతో మొదలైన వర్షం పెద్దగా కురిసింది. నాలాలన్నీ పొంగి నీరు రోడ్లపైకి రావడం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఫలితంగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు.
హైదరాబాద్లో వర్షం...రోడ్లన్నీ జలమయం - RAINS IN HYDERABAD AND ROADS ARE IN WATER
హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి నాలాలన్నీ పొంగి పొర్లాయి. నీరంతా రోడ్ల పైకి రావడం వల్ల పరిసరాలు జలమయమయ్యాయి. ఫలితంగా ట్రాఫిక్కు ఆటంకాలు ఏర్పాడ్డాయి.
![హైదరాబాద్లో వర్షం...రోడ్లన్నీ జలమయం హైదరాబాద్లో మోస్తరు వర్షం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6467712-thumbnail-3x2-rains.jpg?imwidth=3840)