TELANGANA WEATHER REPORT TODAY: రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ రోజు ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగుతూ.. సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని తెలిపింది.
నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం.. ఈ రోజు తెలంగాణ పరిసరాలలోని విదర్భలలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉందని తెలిపింది. నిన్నటి ఉపరితల ద్రోణి ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి.. తెలంగాణలోని ఆవర్తనం పరిసరాలలోని విదర్భ మీదుగా.. పశ్చిమ మధ్యప్రదేశ్ వరకు కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇవీ చదవండి: మునుగోడు ఉపఎన్నిక... అభ్యర్థిని ప్రకటించిన తెరాస