సికింద్రాబాద్లో తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి సీతాఫల్మండి డివిజన్లోని మధురానగర్ను వరద ముంచెత్తింది. మధురానగర్ కాలనీతో పాటు పక్కనే ఉన్న పలు బస్తీల్లో వరద ప్రవాహం చెరువును తలపించింది. మామూలు వర్షానికే వరద ప్రవాహం ఈ మాదిరిగా ఉంటే భారీ వర్షాలు పడితే తమ పరిస్థితి ఏంటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలుమార్లు విజ్ఞప్తి చేసినా
బస్తీలోని ఇళ్లలోకి వరద నీరు చేరిందని స్థానికులు పేర్కొన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని వర్షపు నీటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నాలాల పరిస్థితి దారుణంగా తయారైందని పేర్కొన్నారు. గతంలో కురిసిన వర్షాలను దృష్టిలో ఉంచుకొని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా కూడా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: జులై 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతా: రేవంత్‌రెడ్డి