Hyderabad Rains Today: హైదరాబాద్‌లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. రెండో రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. వానహోరుతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. చందానగర్, మల్కాజ్‌గిరి, కీసర, పంజాగుట్ట, అంబర్‌పేట్, కాచిగూడ, నల్లకుంట ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది.
బాగ్‌లింగంపల్లి, బోలక్‌పూర్, కవాడిగూడ, జవహర్‌నగర్, రాంనగర్, దోమలగూడ, బోయిన్‌పల్లి, కాటేదాన్, మారేడుపల్లి, ప్రాంతాల్లో వాన పడింది. తిరుమలగిరి, బేగంపేట్, అల్వాల్, చిలకలగూడ, గాంధీనగర్, రాజేంద్రనగర్, శివరాంపల్లి, కిస్మత్‌పూర్, శంషాబాద్, మణికొండ, గండిపేట్, ఆరాంఘర్, బండ్లగూడ , నార్సింగి, ప్యాట్నీ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారుల పైకి నీరు రావడంతో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.
రాగల మూడు రోజులు వర్షాలు: రాష్ట్రంలో రానున్న మరో మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. దక్షిణ తెలంగాణలో అతి భారీవర్షాలు.. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.
ఇవీ చదవండి: