ETV Bharat / state

హైదరాబాద్ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వడగండ్ల వానలో వికారాబాద్ - Hyderabad Latest News

రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపోయింది.

rain lashes
rain lashes
author img

By

Published : Mar 16, 2023, 3:44 PM IST

Updated : Mar 16, 2023, 5:29 PM IST

హైదరాబాద్ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వడగండ్ల వానలో వికారాబాద్

రాష్ట్రంలో ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం రాక కాస్త ఉపశమనాన్ని కలిగించింది. ఉత్తర- దక్షిణ ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్ మెదక్, కామారెడ్డి జిల్లాల్లో.. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

రాగల ఐదు రోజులు తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు: ఇందులో భాగంగానే ఈదురు గాలులు గంటలకు 30 నుంచి 40 కిలోమీర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా.. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందనివెల్లడించింది. రాగల ఐదు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వికారాబాద్​లో వడగండ్ల వాన: ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపోయింది. సంగారెడ్డిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల తీవ్రకు చెట్లు, విద్యుత్తు స్థంభాలు కొన్ని నేలకు ఒరిగిపోయాయి. జహీరాబాద్, కోహిర్‌ మండలాల్లో వడగండ్ల వర్షం పడింది. ఉరుములు, మెరుపులకు ఈదురు గాలులతో మోస్తారగా ప్రారంభమై నుంచి భారీ వర్షం పడింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో కూడా వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో  వడగండ్ల వాన భీభత్సం

హైదరాబాద్​లో ఒక్కసారిగా మారిన వాతావరణం: మరోవైపు ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లు పడుతున్నాయి. గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ, అమీర్‌పేట, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. చార్మినార్, చాంద్రాయణగుట్ట, బార్కస్, పురాణపుల్, బహదూర్​పురా, యాకుత్​పురా, ఫలక్​నుమా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన దంచికొట్టింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, లిబర్టీ, హిమాయత్​నగర్, హైదర్​గూడ, నారాయణగూడ, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వాన పడింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి తోడూ వర్షానికి వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం
వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం

ఇవీ చదవండి: ఈనెల 20న విచారణకు హాజరుకావాల్సిందే.. కవితకు ఈడీ నోటీసులు

ఆర్మీ ఛాపర్​ క్రాష్​.. పైలట్ల కోసం విస్తృత గాలింపు

Last Updated : Mar 16, 2023, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.