నేడు, రేపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.
ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఒక ద్రోణి సైతం కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావం వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వివరించింది. ఈ రోజు మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
ఇదీ చూడండి: పది పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులంతా మాస్క్‌లతో హాజరు