హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు చోట్ల మోస్తరుగా వర్షం కురిసింది. నగరంలోని సైనిక్‌పురి, కుషాయిగూడ, చిలకలగూడ, మారేడుపల్లి, సంగీత్, ప్యాట్నీ, అబ్దులాపూర్ మెట్ ప్రాంతాల్లో చిరుజల్లలతో కూడిన వర్షం పడింది. సికింద్రాబాద్‌లోని కాప్రాలో వడగళ్ల వర్షం కురిసింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది.
ఇవీ చూడండి: గులాబీ తీర్థం పుచ్చుకున్న మండవ