ETV Bharat / state

జంట నగరాల్లోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం - telangana rain news

ఎండ తీవ్రత వల్ల ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న భాగ్యనగర వాసులు ఉపశమనం పొందారు. ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం.. సాయంత్రానికి కురిసిన జోరువానతో చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

జంట నగరాల్లో వర్షం
జంట నగరాల్లో వర్షం
author img

By

Published : May 14, 2021, 5:13 PM IST

జంట నగరాల్లో వర్షం

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జంట నగరాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. ఎల్బీ నగర్‌, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, అంబర్‌పేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, పటాన్‌చెరు, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, రామంతాపూర్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్‌, సికింద్రాబాద్, బేగంపేట, ప్యారడైజ్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మొయినాబాద్‌, ఆల్వాల్, చిలకలగూడ, మారేడ్‌పల్లి, ఉప్పల్, బోడుప్పల్, ఘట్‌కేసర్‌, హస్తినాపురం, లంగర్‌హౌస్, కార్వాన్‌, గోల్కొండ, మెహదీపట్నం, మలక్‌పేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది.

ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిచి ముద్దయింది. ఈదురుగాలులకు పలు విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వర్షం కారణంగా నగరంలోని పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జోరు వానకు రోడ్లపై నీరు నిలిచిపోయింది. అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: రాగల మూడు రోజులపాటు వర్షాలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.