గత కొన్ని రోజులుగా తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం ఇవాళ ఒక్కసారిగా చల్లబడింది. జంటనగరాల్లో ఈ సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పటాన్చెరులలో వర్షం పడింది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకపూల్, సైఫాబాద్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, ట్యాంక్ బండ్లలో కూడా వర్షం కురిసింది.
వర్షంతో రోడ్లన్నీ జలమయ్యాయి. వాహనదారులు ఒక్కసారిగా పడిన వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షం నుంచి తడవకుండా కాపాడుకోవటానికి మెట్రో వంతెన కిందకు భారీగా చేరారు. వర్షంతో వేడితో పాటు ఉక్కపోత కూడా తగ్గింది. భానుడి భగభగలకు ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగినా... బయటకు వెళ్లిన వారు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి: స్వాతి లక్రా, బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకాలు