హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలోని అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, లిబర్టీ, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్, తదితర చోట్ల వర్షం కురిసింది. ముషీరాబాద్, కవాడిగూడ, రాంనగర్, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అడిక్‌మెట్, చిక్కడపల్లి, జవహర్‌నగర్, గాంధీనగర్, బోలక్‌పూర్, ఇందిరాపార్కు రోడ్డు, లోయర్ ట్యాంక్ బండ్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్ , సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది.
వివిధ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే వాహనదారులు, బాటసారులు వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ గమ్యస్థానాలకు చేరుకున్నారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు నెమ్మదిగా కదలటం వల్ల రోడ్లు రద్దీగా మారాయి. .
ఇదీ చదవండి:SEED BALLS: విత్తన బంతులతో పాలమూరు యంత్రాంగం గిన్నిస్ రికార్డు