ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని ఏంజే మార్కెట్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌లో కురిసిన వర్షానికి రోడ్లపైకి నీరు చేరడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, మారేడుపల్లి, చిలకలగూడ ,ప్యారడైజ్, బేగంపేట్‌లో వాన పడింది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్ హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా కారుమబ్బు కమ్ముకొని వర్షం కురిసింది.
ఇదీ చదవండి : ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం