ETV Bharat / state

దినదిన గండం: ఇంకా జలదిగ్బంధంలోనే జీవనం - రామంతపూర్​ ప్రజలకు వరద కష్టాల వార్తలు

వరణుడి బీభత్సానికి హైదరాబాద్​ హడలిపోయింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినా.. అనేక కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా కాలనీల్లోని ఇళ్లు వరద నీటితో నిండిపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. రామంతపూర్​లోని లక్ష్మీనగర్ కాలనీలోని వెయ్యి ఇళ్లలో వరద నీరు చేరింది. ఆ కాలనీలోని ప్రజలు వేరేచోటుకు వెళ్లలేకుండా ఉంది. ప్రభుత్వ సహాయం తమకు ఇంకా అందలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా జలదిగ్బంధంలోనే అనేక కాలనీలు
ఇంకా జలదిగ్బంధంలోనే అనేక కాలనీలు
author img

By

Published : Oct 20, 2020, 12:06 PM IST

హైదరాబాద్ రామంతపూర్​లో వరద ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అనేక కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జలదిగ్బంధంలోనుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉన్నారు. చాలా కాలనీల్లో విద్యుత్​ స్తంభాలు పడిపోయి.. ఇప్పటికీ విద్యుత్​ సరఫరా పునరుద్ధరణ కాలేదు.

రామంతపూర్​లోని లక్ష్మీనగర్ కాలనీలోని వెయ్యి ఇళ్లలో వరద నీరు చేరింది. ఆ కాలనీలోని ప్రజలు వేరేచోటుకు వెళ్లలేకుండా ఉంది. అక్కడ సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టంగా మారింది. తాము అనేక ఇబ్బందులకు గురైన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదంటున్న కాలనీ వాసులతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

ఇంకా జలదిగ్బంధంలోనే అనేక కాలనీలు

ఇదీ చదవండి: వారం నుంచి నీటిలోనే.. వ్యాధులు ప్రబలతాయని ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.