Rain Effect in Hyderabad : గత 48 గంటలుగా అతి భారీ వర్షాలు కురుస్తుండగా, నిన్నటి నుంచి మరింత జోరందుకున్నాయి. వానలతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. కుత్బుల్లాపూర్, మియాపూర్, మేడ్చల్ ప్రాంతాల్లో అనేక కాలనీలు జలమయమయ్యాయి.
Hyderabad Rains Today : మేడ్చల్ రూరల్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ నీట మునిగింది. ఇక్కడి పదుల సంఖ్యలోని వసతిగృహాల్లో ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్నారు. వర్షాలకు హాస్టళ్లన్నీ నీట మునిగి ఒకటో అంతస్తు వరకు నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు (Rain Affect in Hyderabad) పడ్డారు. అధికారులు విద్యార్థులను ట్రాక్టర్లు, జేసీబీల్లో తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 గంటల మధ్య 10 సెం.మీ భారీ వర్షం కురవడంతో ఎక్కువ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు మియాపూర్ ప్రాంతంలో 18 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇదే తంలోని పటేల్ చెరువుకు గండి పడింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దాదాపు 12 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.
Telangana Heavy Rains Today : రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం.. జలమయమయిన ప్రాంతాలు
Hyderabad Rains Updates : కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట, కేపీహెచ్‌బీ కాలనీ, ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజీగూడ, బేగంపేట, సికింద్రాబాద్, చిలకలగూడ, ఉప్పల్, మలక్‌పేట, అంబర్‌పేట, పాతబస్తీ, ఖాజాగూడ, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లలో భారీ వర్షం నమోదైంది. అమీర్‌పేట నుంచి జేఎన్‌టీయూకు, మెహదీపట్నం నుంచి హైటెక్ సిటీకి రాకపోకలు నిలిచిపోయాయి. ఆరాంఘర్, ఈఎస్‌ఐ, ఎర్రగడ్డ, బల్కంపేట ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు, ఓ అంబులెన్సు వరదలో చిక్కుకుపోయాయి. లంగర్‌హౌజ్‌లోని లక్ష్మీనగర్‌లో ఇళ్లలోకి మురికినీరు చేరింది. దుండిగల్ ప్రాంతంలోని మల్లంపేట పీవీఆర్ మెడోస్ కాలనీ, భౌరంపేట్‌లోని ల్యాండ్ మార్క్-2 కాలనీలు జలమయమయ్యాయి.
Heavy Flood in Musi River : భారీ వర్షాల వేళ హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు (Twin Reservoirs) ఎత్తివేయడంతో పురానాపూల్ వద్ద మూసీ ఉప్పొంగుతోంది. పరివాహక ప్రాంతంలో పరిస్థితిని అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ పర్యవేక్షించి... స్థానికులను అప్రమత్తం చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో వరద ప్రాంతాల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే వివేకానంద పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు బాధితులను కాపాడేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. టోలీచౌకి వద్ద విధులు నిర్వహిస్తున్న సౌత్ వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి ఫ్లైఓవర్ వద్ద నీళ్లు నిండిపోవడంతో మ్యాన్‌హోల్‌పై పేరుకుపోయిన చెత్తను స్వయంగా తొలగించారు.
Hyderabad Floods 2023 : భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో అప్రమత్త చర్యలను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్‌తో పాటు ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడి, పరిస్థితులను ఆరా తీశారు. వర్షాల కారణంగా ప్రజలు ఎక్కడ ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా నాలాల వద్ద ప్రత్యేక భద్రతాచర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు భారీగా కురుస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బీజేపీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అత్యవరసమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ప్రజలను ఆయన కోరారు. ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
Heavy Rains in Hyderabad Today : భాగ్యనగరం జలదిగ్బంధం.. ఎటుచూసినా వరదే.. అడుగు పెడితే బురదే
వికారాబాద్ ప్రాంతంలోని మోమిన్‌పేట్, నవీపేట, వికారాబాద్, ధరూర్ మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గేరిగేటిపల్లి, దాచారం, పూల్‌మది, రాళ్లచిటంపల్లి, మద్గుల్ చిటంపల్లి, దన్నారం ఉప్పొంగే వాగులతో గ్రామాలకు రాకపోకలకు అంతరాయం నెలకొంది. అనంతగిరి అటవీ ప్రాంతం వైద్య కళాశాల సమీపంలో రోడ్డుపై చెట్లు విరిగిపడి... ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాలకు మొత్తం అయిదుగురు మృత్యువాత పడ్డారు.
Hyderabad Rains in September 2023 : హైదరాబాద్ ప్రగతినగర్‌లోని అపార్టుమెంట్ ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు మిథున్‌రెడ్డి నాలాలో పడి మృత్యువాత పడ్డాడు. బాలానగర్ పరిధిలో షేక్ నిషాద్‌పర్వీన్ అనే యువకుడు విద్యుదాఘాతంతో మరణించారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపూర్ శివారు శాంతినగర్ గ్రామ సమీపంలో చిట్యాల రామ్‌నగర్ కాలనీకి చెందిన చిలువేరు సరిత(40), నేర్పటి మమత(35) మరి కొందరు కూలీ పనులకు వెళ్లి, పిడుగుపాటుకు గురయ్యారు. (Three People Died With Storm Effect)ఈ ఘటనలో సరిత, మమత అక్కడికక్కడే మరణించారు. మరో ఘటనలో కాటారం మండలం దామెరకుంటకు చెందిన కౌలు రైతు గూడూరి రాజేశ్వరరావు పిడుగుపాటుకు బలయ్యారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామ గొల్లవాడలో విద్యుదాఘాతంతో అయిదు గేదెలు మంగళవారం మృతి చెందాయి.
Heavy Rains in Hyderabad Today : హైదరాబాద్‌లో కురుస్తున్న జోరు వానలు.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ