ETV Bharat / state

రాయితీలు పునరుద్ధరించని రైల్వే

author img

By

Published : Nov 14, 2021, 6:35 AM IST

కొవిడ్‌కు ముందు ఉన్న విధానంలోనే రైళ్లను నడుపుతామని, పాత ఛార్జీలే వసూలుచేస్తామని ప్రకటించిన రైల్వేశాఖ ఆ మేరకు ప్రయాణికులకు పూర్తిస్థాయిలో ప్రయోజనాల్ని అందించడం లేదు. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని శుక్రవారం ప్రకటించినా.. ‘ప్రత్యేక’ రైళ్ల పేరుతో అదనపు బాదుడుకు శనివారం అర్ధరాత్రి (ఆదివారం) నుంచి మాత్రమే స్వస్తి పలికింది (railway not celerity on advance paid amount). అయితే.. వయోవృద్ధులు సహా పలురకాల వారికి ఇచ్చే రాయితీల్ని దక్షిణ మధ్య రైల్వే సహా పలు జోన్లు ఇంకా పునరుద్ధరించలేదు.

railway
railway

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం ప్రయాణానికి 75 ఏళ్ల వ్యక్తికి టికెట్‌కు ప్రయత్నం చేస్తే సీనియర్‌ సిటిజన్‌ కన్సెషన్‌ రాయితీ లేకుండా పూర్తి ఛార్జీ చూపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రయాణానికి టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికుల నుంచి వసూలుచేసిన అదనపు ఛార్జీలను తిరిగి చెల్లిస్తారా? లేదా? అన్న విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు (railway not celerity on advance paid amount). ప్రయాణ దూరం, తరగతి, రైలుని బట్టి ఒక్కో టికెట్‌పై రూ.75-100 నుంచి దురంతో వంటి రైళ్లలో రూ.350-400 వరకు అదనంగా వసూలుచేశారు. 14వ తేదీ నుంచి రెగ్యులర్‌ రైళ్లుగానే నడపనున్న నేపథ్యంలో.. అదనంగా వసూలుచేసిన ఛార్జీలను తిరిగి ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కొన్ని ప్రత్యేక రైళ్ల సమయ వేళల్లో (special trains timing changes) మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 15నుంచి మార్పులు ఉంటాయి ప్రయాణికులు గమనించాలని తెలిపింది.

special trains: ప్రయాణికులకు విజ్ఞప్తి.. పలు ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పులు

ఈ నెల 15 నుంచి పలు ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్లు (special trains timing changes) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు గమనించాలని సూచించిది.

  • హెచ్ఎస్​నాందేడ్-ముంబాయి సీఎస్​ఎంటీ స్పెషల్ (CSMT Special) కల్యాణ్​ స్టేషన్​లో 8.38 గంటలకు బయలుదేరుతుంది.
  • హెచ్​ఎస్​నాందేడ్ -ముంబయి సీఎస్ఎంటీ స్పెషల్ థానే స్టేషన్​లో 8.58 గంటలకు బయలుదేరుతుంది.
  • ముంబయి ఎల్​టీటీ-కోయంబత్తూర్ స్పెషల్ (Coimbatore Special) కుర్థువాడి స్టేషన్​లో 4.33 గంటలకు బయలుదేరుతుంది.
  • హైదరాబాద్-హదాస్పర్ (Hyderabad-Hadaspar) లాథూర్ స్టేషన్​లో 3.50 గంటలకు బయలుదేరుతుంది.
  • హైదరాబాద్-హదాస్పర్ (Hyderabad-Hadaspar) బార్సీ స్టేషన్​లో 6.03 గంటలకు బయలుదేరుతుంది.
  • హైదరాబాద్-హదాస్పర్ కుర్థువాడి స్టేషన్​లో 7.25 గంటలకు బయలుదేరుతుంది.
  • ధన్​బాద్ -కొల్హాపూర్ స్పెషల్ (Dhanbad-Kolhapur Special) ఉస్మానాబాద్ స్టేషన్​లో 5.07 గంటలకు బయలుదేరుతుంది.
  • హెచ్​ఎస్​నాందేడ్ -పూనే స్పెషల్ (Nanded-Pune Special) దాండ్ కోర్డ్ లైన్ స్టేషన్​లో 8.18 గంటలకు బయలుదేరుతుందని రైల్వేశాఖ తెలిపింది.

read also: Special Trains: 'స్పెషల్​ రైళ్లు' రద్దు చేస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.