ETV Bharat / state

శాటిలైట్​ స్టేషన్​ నిర్మాణానికి నేడు శంకుస్థాపన

కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్​గోయల్​ ఇవాళ హైదరాబాద్​లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి మధ్యాహ్నం ఒంటి గంటకు శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్​ వేదికగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పనులు ప్రారంభిస్తారు.

Charlapalli Satellite Railway Station
శాటిలైట్​ స్టేషన్​ అభివృద్ధికి నేడు శ్రీకారం
author img

By

Published : Feb 18, 2020, 9:16 AM IST

హైదరాబాద్‌ శివారు చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. 100 కోట్ల రూపాయలు వెచ్చించి.. 250 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

స్థల సేకరణలో ఆలస్యంతో జాప్యం జరిగింది. రైల్వే శాఖ వద్ద ప్రస్తుతం ఉన్న 50ఎకరాల్లోనే స్టేషన్‌ అభివృద్ధికి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 427 రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఉచితంగా వైఫై సేవలనూ పీయూష్‌ గోయల్‌ ప్రారంభిస్తారు. ఎర్రగుంట -నంద్యాల విద్యుదీకరణ, గుంతకల్-కల్లూరు సెక్షన్ డబుల్‌లైన్‌ను వీడియో రిమోట్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తారు.

శాటిలైట్​ స్టేషన్​ అభివృద్ధికి నేడు శ్రీకారం

ఇదీ చూడండి: విద్యార్థుల జీవితాలతో చెలగాటమా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.