సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే రక్షకదళం పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేశారు. దీపావళి సందర్భంగా రైళ్లలో ప్రయాణించే వారు ఎవ్వరూ బాణాసంచా తీసుకెళ్లొద్దని సూచించారు. రెండో నంబరు ప్లాట్‌ఫాంపై గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో క్షుణ్ణంగా సోదాలు చేశారు.
రైళ్లలో బాణాసంచా తీసుకెళ్లడం నిషేదించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికుల బ్యాగులను డాగ్ స్క్వాడ్‌తో సోదాలు చేశారు.
ఇదీ చూడండి: 'సన్నాల సాగుకు రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది'