ETV Bharat / state

వినియోగదారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం వీడియో కాన్ఫరెన్స్​

author img

By

Published : Aug 27, 2020, 9:40 PM IST

ప్రధాన సరుకు రవాణా వినియోగదారులతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. వ్యాపార అభివృద్ధి, యూనిట్లు ఏర్పాటు చేయడం, సరుకు రవాణాలో అనేక రాయితీలను వర్తింపజేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.కొవిడ్ -19 మహమ్మారి వ్యాపిస్తున్న పరిస్థితుల్లో సరుకు రవాణాకు మద్దతు ఇస్తున్న వినియోగదారులను గజానన్ మాల్యా అభినందించారు.

Railway_Gm_Meeting_With_Major_Freight_Customers
వినియోగదారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం వీడియో కాన్ఫరెన్స్​

ప్రధాన సరుకు రవాణా వినియోగదారులతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. సరుకు రవాణా రంగం నిర్వహణలో జోన్ ​వ్యాప్తంగా దక్షిణ మధ్య రైల్వే అత్యంత శ్రద్ధ కనబరుస్తోందని అందులో భాగంగా.. వ్యాపార అభివృద్ధి, యూనిట్లు ఏర్పాటు చేయడం, రవాణాలో అనేక రాయితీలను వర్తింపజేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

Railway_Gm_Meeting_With_Major_Freight_Customers
విద్యుత్​ ఉత్పత్తి కంపెనీల అధికారులతో సమావేశం

జీఎం గజానన్ మాల్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోర్ట్ అధికారులు, విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు, భారత ఆహార సంస్థ, ప్రజా పంపిణీ విభాగాల వినియోగదారులతో విడివిడిగా సంప్రదింపులు కొనసాగిస్తూ అనేక వెబినార్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ -19 మహమ్మారి వ్యాపిస్తున్న పరిస్థితుల్లో సరుకు రవాణాకు మద్దతు ఇస్తున్న వినియోగదారులను గజానన్ మాల్యా అభినందించారు.

లోడింగ్​ విషయంలో సహకారం అందిస్తాం..

సరుకు రవాణా కోసం లోడింగ్ విషయంలో దక్షిణ మధ్య రైల్వే తమ సహకారం అందిస్తూనే ఉంటుందని ఆయన హామీనిచ్చారు. సరుకు రవాణా క్రమంగా పుంజుకుంటోందని, పోర్ట్​లోని లోడింగ్ విభాగంలో ఎగుమతులు సూచిస్తున్నాయని ఓడరేవుల రంగం వినియోగదారులు జనరల్ మేనేజర్​కు వివరించారు. సరుకు రవాణా వల్ల వ్యాపారం 20శాతం పెరుగుతుందని కృష్ణపట్నం రేవు అధికారులు భరోసా ఇచ్చారు. కొవిడ్-19 పరిస్థితుల్లో కూడా గత సంవత్సరం కంటే ఆధిక్యతను సాధిస్తామని కాకినాడ పోర్ట్ అధికారులు అభిప్రాయపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి విభాగం వినియోగదారులు కూడా రైల్వే ద్వారా బొగ్గు రవాణాకి ఆర్ధిక సంవత్సరం రెండో సగభాగంలో డిమాండ్ పెరుగుతుందని అన్నారు.

భారత ఆహార సంస్థ, ప్రజా పంపిణీ వినియోగదారులతో సమావేశం

అధికారులను అభినందించిన జీఎం

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆహార ధాన్యాల లోడింగ్​లో 100శాతం వృద్ధికి సహకారం అందజేసిన ఆహారసంస్థలు, ప్రజాపంపిణీ విభాగాల అధికారులను జీఎం అభినందించారు. గత సంవత్సరం ఇదే సమయంలో 2 మిలియన్ టన్నులతో పోలిస్తే ఆహార ధాన్యాల లోడింగ్ 4 మిలియన్లు ఎక్కువగా ఉందన్నారు. రాబోయే నెలల్లో సరుకు రవాణాలో మరింత అభివృద్ధి కనబరుస్తుందని అధికారులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాపంపిణీ విభాగం వారు వేర్ హౌస్ సౌకర్యం కల్పించాలని జీఎంను కోరారు. వేర్ హౌసింగ్ సౌకర్యం సంయుక్తంగా కల్పించడానికి స్థలాలను గుర్తించేందుకుగాను రైల్వే సాధ్యమైనంతగా సహకరిస్తుందని రైల్వే జీఎం భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.