సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం నెంబర్ 10లో మజ్దూర్ యూనియన్ నాయకులు, కార్మికులు రెండు గంటల పాటు ధర్నా చేశారు. ఏటా దసరా పండుగకు ముందు ఇవ్వాల్సిన లింకు బోనస్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆలిండియా రైల్వే ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రేపు పార్లమెంట్లో క్యాబినెట్ సమావేశంలో బోనస్ ప్రకటించకపోతే.. గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తో పాటు ఆలిండియాలో రైళ్లన్నీ ఆపుతామని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జోన్ కార్యదర్శి అరుణ్‌కుమార్ హెచ్చరించారు.
2019-20కు సంబంధించిన బోనస్‌లు ఇవ్వాలని లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ప్రాణాలు త్యాగం చేసి సంపాదించిన బోనస్ ఇవ్వకపోతే కార్మికులు హైరానా పడతారని అరుణ్‌కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు ముందుకు వచ్చి ధర్నా చేస్తున్నామని తెలిపారు. తమ హక్కు అయన బోనస్ కోసం అవసరమైతే రైల్వేను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండిః దిగొచ్చిన బంగారం, వెండి- నేటి ధరలు ఇవే