ETV Bharat / state

Ajampura rub: రైల్వే గుత్తేదారు నిర్వాకం.. పెరిగిన వాహనాల రద్దీ.! - hydearabad news

వర్షాకాలం ఆరంభమైందంటే చాలు భాగ్యనగర రహదారులు చెరువులను తలపిస్తాయి. రోజువారీ కార్యక్రమాల మీద బయటకు వెళ్లినవారు ఆ రోడ్ల మీద నుంచి ఇంటికి వెళ్లడమంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఎక్కడ మ్యాన్​ హోల్​ ఉంటుందో ఎక్కడ కాలువ ఉంటుందో అర్థం కాక.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడవాలి. ఈ సమస్యలకు పరిష్కారాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. అది మాటలకే పరిమితం అవుతుంది. ఓ వైపు కాంట్రాక్టర్ల అలసత్వం కూడా కారణమే.. దానికి నిదర్శనమే ఆజంపురా నాలా పనులు.

ajampura
ఆజంపురా
author img

By

Published : Jul 15, 2021, 7:21 PM IST

హైదరాబాద్​ మలక్​పేట సర్కిల్​ ఆజంపురా ఆర్​యూబీ వద్ద నాలా పక్కన రక్షణ గోడ విషయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై ఈనాడు- ఈటీవీ భారత్​లో కథనం ప్రసారమైనా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రక్షణ గోడ నిర్మాణం కోసం నాలాలో తవ్విన మట్టిని తిరిగి నాలాలోనే పోయడంతో భారీ వర్షాలకు ఆ మట్టి రోడ్లపైకి కొట్టుకువస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఆర్​యూబీ వంతెన వద్ద నాలా పూడుకుపోయే ప్రమాదం ఉంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ajampura
మట్టి తోడి నాలాలోనే వేసిన వైనం
ajampura
మురికి కాలువను తలపిస్తున్న సబ్​వే

రైల్వేై గుత్తాదారు నిర్వాకంతో నాలాలో పోసిన మట్టి.. వర్షానికి రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల కొద్దీ వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకోకపోతే నాలా కూడుకుపోయే ప్రమాదం ఉంది.

ajampura
మలక్​పేట్​ రైల్వేస్టేషన్​ వద్ద వాహనాల రద్దీ

ఇదీ చదవండి: CPI RALLY: కేసీఆర్​ సర్కారుపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది: కూనంనేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.