Rahul Gandhi on Pravallika Suicide: గ్రూప్-2 వాయిదాతో నిరుత్సాహం చెంది ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ట్విటర్‌లో ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ ఆ నిరుద్యోగ యువతి ఆత్మహత్యకు పాల్పడిన వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. అది చాలా బాధాకరం, విచారకరమని వ్యాఖ్యానించారు. అది ఆత్మహత్య కాదన్న రాహుల్ గాంధీ అది ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు.
-
कल हैदराबाद में एक छात्रा की आत्महत्या का समाचार अत्यंत दुखद है।
— Rahul Gandhi (@RahulGandhi) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ये आत्महत्या नहीं, हत्या है - युवाओं के सपनों की, उनकी उम्मीदों और आकांक्षाओं की।
तेलंगाना का युवा आज बेरोज़गारी से पूरी तरह टूट चुका है। पिछले 10 सालों में BJP रिश्तेदार समिति - BRS और BJP ने मिलकर अपनी अक्षमता…
">कल हैदराबाद में एक छात्रा की आत्महत्या का समाचार अत्यंत दुखद है।
— Rahul Gandhi (@RahulGandhi) October 14, 2023
ये आत्महत्या नहीं, हत्या है - युवाओं के सपनों की, उनकी उम्मीदों और आकांक्षाओं की।
तेलंगाना का युवा आज बेरोज़गारी से पूरी तरह टूट चुका है। पिछले 10 सालों में BJP रिश्तेदार समिति - BRS और BJP ने मिलकर अपनी अक्षमता…कल हैदराबाद में एक छात्रा की आत्महत्या का समाचार अत्यंत दुखद है।
— Rahul Gandhi (@RahulGandhi) October 14, 2023
ये आत्महत्या नहीं, हत्या है - युवाओं के सपनों की, उनकी उम्मीदों और आकांक्षाओं की।
तेलंगाना का युवा आज बेरोज़गारी से पूरी तरह टूट चुका है। पिछले 10 सालों में BJP रिश्तेदार समिति - BRS और BJP ने मिलकर अपनी अक्षमता…
యువత కలలు, వారి ఆశలు, ఆకాంక్షలపై జరిగిన హత్యగా ఆయన రాహుల్ అభివర్ణించారు. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిలలాడుతోందని విమర్శించారు. గడిచిన పదేండ్లలో బీఆర్‌ఎస్ చేతకాని తనంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తుందని, నెలలోనే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పునర్వ్యవస్థీకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఏడాదిలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Governor Tamilisai Response on Pravalika Suicide : మరోవైపు ప్రవల్లిక ఆత్మహత్య ఘటనపై గవర్నర్ తమిళి సై కూడా స్పందించారు. ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించి 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, టీఎస్పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ఆమె మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని తెలిపారు. మృతురాలు ప్రవల్లిక కుటుంబసభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆమె అకాల మరణం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువ ఔత్సాహికులకు సవాళ్లు, ఒత్తిళ్లకు గురిచేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రూపు-2 పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రవల్లిక జీవితాన్ని కోల్పోయినందుకు తీవ్ర విచారకరమైనప్పటికీ.. ఈ విషాద సంఘటన ద్వారా లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు గవర్నర్ తెలిపారు. ఎలాంటి ఘటనలు ఎదురైనా నిరుద్యోగ యువత ఆశలు వదులుకోవద్దని, ఉపాధిని పొందే దిశగా ధైర్యం ప్రదర్శించాలని తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఉపాధి లక్ష్యాలను చేరుకోవడంలో అభ్యర్థులకు సహాయం చేసేందుకు తన నిబద్ధతను నొక్కి చెబుతూ, ఈ ప్రయత్నంలో తన అచంచలమైన మద్దతు ఉంటుందని గవర్నర్ హామీ ఇచ్చారు.
Khammam Unemployed Suicide : 'ఇగ నోటిఫికేషన్లు రావు.. పిచ్చి లేస్తోంది'
Suicides in Hyderabad : హైదరాబాద్‌లో ఆత్మహత్యల అలజడి.. 25 రోజుల్లోనే ఏకంగా..!
ప్రవల్లిక ఆత్మహత్యపై ఉద్యోగ సంఘాలు, ఉద్యోగార్థులు రాత్రంతా ఆందోళన నిర్వహించారు. మృతదేహానికి రాత్రి పోస్టుమార్టం అనంతరం తన స్వగ్రామం బికాజిపల్లెకి భారీ బందోబస్తుతో తరలించారు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బోరున విలపించారు. ఆమె అంతిమ యాత్రలో బీజేపీ, కాంగ్రెస్ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Couple Selfie Suicide : భూ తగాదాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో వైరల్
Selfie Suicide In Hanamkonda : 'నా లవర్, ఆమె ఫ్రెండ్ వేధింపుల వల్లే చనిపోతున్నా'