ETV Bharat / state

Rahul Gandhi Tour: రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటన తేదీలు ఖరారు

Rahul Gandhi Tour: రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. మే 6, 7 తేదీల్లో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. మే 6న సాయంత్రం వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ హజరవుతారని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్​ ప్రకటించారు.

Rahul Gandhi Tour: రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటన తేదీలు ఖరారు
Rahul Gandhi Tour: రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటన తేదీలు ఖరారు
author img

By

Published : Apr 16, 2022, 7:13 PM IST

Updated : Apr 16, 2022, 7:33 PM IST

Rahul Gandhi Tour: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ... రాష్ట్ర పర్యటన తేదీ ఖరారైంది. మే 6న సాయంత్రం వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ హజరవుతారని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్​ ప్రకటించారు. మరుసటి రోజు మే 7న హైదరాబాద్‌లో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో రైతు వ్యవసాయ సమస్యలపై కాంగ్రెస్ సభ నిర్వహిస్తుందని మధుయాస్కీ పేర్కొన్నారు. వయో పరిమితిని పెంచే విధంగా కాంగ్రెస్ నిరుద్యోగులకు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటన తేదీలు ఖరారు

'వచ్చే నెల 6వ తారీఖున వరంగల్​లోని ఆర్ట్స్​ కాలేజీలో రైతు సంఘర్షణ సభ జరుగుతుంది. ఆ సభకు రాహుల్​గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సభలో రైతు సమస్యలపై, కేసీఆర్​ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, ధాన్యం కొనుగోళ్లు, భాజపా సర్కారు తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ ఏ విధంగా పోరాడిందో ప్రజలకు చెబుతారు. రైతుల పక్షాన ఈ సభ జరగబోతోంది.' -మధుయాస్కీ గౌడ్​, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్​

ఎస్సై, కానిస్టేబుల్‌ ఇతర యూనిఫాం ఉద్యోగాల వయోపరిమితి 5ఏళ్లు పెంచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ మానవతా రాయ్‌ నేతృత్వంలో ఓయూ నిరుద్యోగులు మధుయాస్కీకి వినతిపత్రం సమర్పించారు. తెరాస నాయకులు ప్రజలను మెప్పించలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఖమ్మంలో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్టు కేసులు పెడుతున్నారని ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ఒత్తిడితో పెడుతున్న కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు.

'దేశానికి అన్నం పెట్టే రైతులను కాపాడాలనే ఉద్దేశంతో గత సంవత్సరమంతా భాజపా సర్కారు తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్​ గాంధీ పోరాడారు. దిల్లీ సరిహద్దుల్లో రైతుల చేపట్టిన దీక్ష విజయవంతం కావడంలో రాహుల్​ గాంధీ పాత్ర కూడా కీలకమైంది. ఇవాళ రైతులను ఏడ్చే స్థితికి తీసుకొచ్చింది కేసీఆర్​ రైతుల విధానాలే.' -సీతక్క, ములుగు ఎమ్మెల్యే

ఇదీ చదవండి:

Last Updated : Apr 16, 2022, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.