ETV Bharat / state

ప్రజల మధ్య ఉంటేనే టికెట్​.. తెలంగాణలో రాహుల్ టూర్ సక్సెస్ - Rahul Gandhi News

Rahul Gandhi Telangana Tour: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండ్రోజుల రాష్ట్ర పర్యటన... పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. పొత్తులపై పార్టీ వైఖరి ఏమిటో రాహుల్‌ స్పష్టం చేశారు. ఇతర పార్టీలకు సహకరిస్తూ కోవర్టుల్లా వ్యవహరిస్తున్ననాయకులు... పార్టీని వీడి వెళ్లొచ్చని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ వెనుక ధనబలం ఉన్నా... ప్రజాబలం లేదన్న రాహుల్‌... రాబోయే ఎన్నికలు తెరాస, కాంగ్రెస్‌ మధ్య యుద్ధాన్ని తలపిస్తాయన్నారు. టికెట్ల విషయంలో ఎవరూ హైదరాబాద్‌, దిల్లీ చుట్టూ తిరగవద్దని... ప్రతిభ ఆధారంగా ఇంటికే వస్తాయని స్పష్టం చేశారు.

Rahul Gandhi
Rahul Gandhi
author img

By

Published : May 8, 2022, 5:04 AM IST

Updated : May 8, 2022, 6:07 AM IST

ప్రజల మధ్య ఉంటేనే టికెట్​.. తెలంగాణలో రాహుల్ టూర్ సక్సెస్

Rahul Gandhi Telangana Tour: రాష్ట్రంలో రెండ్రోజులు పర్యటించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ... పార్టీ విధానాలు, భవిష్యత్‌ వ్యూహంపై... శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ వైఖరిని వివరించారు. మొదటి రోజు వరంగల్‌ సభలో సాగును లాభాల బాట పట్టించేందుకు వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రకటించారు. రెండోరోజు హైదరాబాద్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తెరాస సర్కార్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అరాచక పాలన కొనసాగుతోందని, సంపదంతా ఒకే కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు.

ఎన్నో ఆశయాలతో కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రమిస్తే... అందులో ఏ ఒక్కటీ నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు న్యాయం జరగడం లేదన్న రాహుల్‌... కేసీఆర్ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెరాసపై కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటంలో యువత కదలిరావాలన్న రాహుల్‌... వచ్చే ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ మధ్య యుద్ధాన్ని తలపించేలా పోటీ ఉంటుందన్నారు.

ఈ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌ మధ్యే పోటీ. తెలంగాణను దోచుకున్న కేసీఆర్‌కు డబ్బులకు లోటులేదు. ప్రభుత్వం వల్ల పోలీసులతోపాటు అన్ని వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అయితే జనం మాత్రం లేరు. ప్రజలను మించిన శక్తి ఏదీ లేదు. తెలంగాణ ప్రజలతో కలిసి మనం స్వరాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పడు ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముందున్న లక్ష్యం. నియంతృత్వ సర్కార్‌ కాదు.. రైతులు, పేదలు సహా ప్రతి వ్యక్తికి భాగస్వామ్యం కల్పించేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.

-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

సిద్ధంగా ఉండండి: రాబోయే ఎన్నికల్లో అధికారపార్టీని గట్టిగా ఎదుర్కోవాల్సి వస్తోందన్న రాహుల్‌... అందుకు నాయకులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌, ధిల్లీకి తిరిగితే పార్టీ టికెట్లు రావని.... క్షేత్రస్థాయిలో మకాం వేసి ఓటర్లలో పార్టీపై విశ్వాసం కల్పించాలని శ్రేణులకు సూచించారు. వరంగల్‌ డిక్లరేషన్‌ వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

నేతల పనితీరు ప్రాతిపదికనే టికెట్లు కేటాయిస్తాం. పనిచేసేవారికి, ప్రజల్లో ఉండేవారికే ఇస్తాం. ఎంత సీనియర్‌ అయినా, ఎంతటి చరిత్ర ఉన్నా పనిచేయకుంటే టికెట్‌ ఇచ్చేది లేదు. ప్రజలు ఎవర్ని కోరుకుంటున్నారో, ఎవరైతే జనం మధ్య ఉంటారో వారికే ప్రతిఫలం లభిస్తుంది. వరంగల్‌ డిక్లరేషన్‌ను తెలంగాణలో ప్రతి వ్యక్తికి తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించడమే నేతల మొదటిపని. హైదరాబాద్‌లోనే ఉండకండి. దిల్లీకి ఎట్టి పరిస్థితుల్లో రాకండి. వస్తే పరిస్థితి తారుమారవుతుంది. నియోజకవర్గాలకు వెళ్లండి.. ప్రజలే మీకు టికెట్లు ఇస్తారు.

-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

పార్టీలో అసమ్మతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని రాహుల్‌ తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌లో అందరి అభిప్రాయాలు గౌరవిస్తామని... ఎవరైనా గీత దాటి ప్రవరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

మేం అందరి మాటలను వినాలనుకుంటున్నాం. మీడియాలో మాత్రం కాదు. తలుపులు మూసి ఉన్న గదుల్లో కుటుంబసభ్యులు ఎలా మాట్లాడుకుంటారో అలా. ఫిర్యాదులేమైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై ఎంత స్వేచ్ఛగానైనా చెప్పుకోవచ్చు. మీడియాలో మాట్లాడుతున్న వారితోనే పార్టీకి నష్టం జరుగుతోంది. దీనిని ఇకపై ఊపేక్షించేది లేదు.

-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

కేడర్​లో జోష్: రెండ్రోజుల రాహుల్‌ పర్యటనతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో నూతనోత్సాహం వచ్చింది. పొత్తుల విషయంలో పార్టీ వైఖరి ఏమిటో అయోమయంలో ఉన్న పార్టీ శ్రేణులకు స్పష్టత వచ్చినట్లయింది. కేసీఆర్‌ను గద్దె దించేందుకు ... అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

Last Updated : May 8, 2022, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.