ETV Bharat / state

భాజపా, తెరాస దోస్తీ.. ఎన్నికలప్పుడే కుస్తీ: రాహుల్​గాంధీ - bharat jodo yatra in hyderabad

దేశంతో పాటు తెలంగాణలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. భారత్ జోడో యాత్ర 55వ రోజు భాగ్యనగరంలో సాగింది. దిల్లీ కంటే ఎక్కువ కాలుష్యం హైదరాబాద్​లో ఉందన్న రాహుల్ గాంధీ.. వ్యవసాయం లాభసాటిగా లేదని, ఉద్యోగాలు లేక ఇంజినీరింగ్ చదివిన వారు డెలివరీ బాయ్​లుగా పని చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రెండు భారతదేశాలను చూస్తున్నామని.. దానికి వ్యతిరేకంగానే జోడో యాత్ర చేపట్టినట్లు వివరించారు. అన్నింటినీ అమ్మి దోచుకుంటున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు.. అవకాశం ఉంటే గాలిపై కూడా పన్ను వేస్తారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. భాజపాయేతర ప్రభుత్వం రాహుల్ గాంధీతోనే సాధ్యమని.. అది 2024లో సాకారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

భాజపా, తెరాస దోస్తీ.. ఎన్నికలప్పుడే కుస్తీ: రాహుల్​గాంధీ

author img

By

Published : Nov 1, 2022, 10:57 PM IST

భాజపా, తెరాస దోస్తీ.. ఎన్నికలప్పుడే కుస్తీ: రాహుల్​గాంధీ

భారత్ జోడో యాత్ర 55వ రోజున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. పురానాపూల్ నుంచి యాత్ర ప్రారంభించిన ఆయన.. చారిత్రక చార్మినార్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చార్మినార్ నుంచి అఫ్జల్​గంజ్, ఎంజే మార్కెట్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా పీవీ మార్గ్​కు చేరుకున్నారు. అక్కడ మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరాగాంధీకి నివాళి అర్పించారు. అనంతరం ఇందిరా విగ్రహం వద్ద జరిగిన సమావేశంలో రాహుల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్ సహా ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హింస, విద్వేషానికి వ్యతిరేకంగా తాను ప్రారంభించిన యాత్రను ఏ శక్తి ఆపలేదన్న రాహుల్ గాంధీ.. ఎలాంటి విద్వేషం, గొడవలు లేకుండా ప్రేమతో నదిలా లక్షలాది మంది ఏకమవుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కువ కాలుష్యం దిల్లీలోనే ఉందని తాను అనుకున్నానన్న ఆయన... హైదరాబాద్​లోనే ఎక్కువగా ఉందని అన్నారు. తెలంగాణలో రైతులు, అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని.. ఇంజినీర్లు కూడా స్విగ్గీ, పిజ్జా డెలివరీ బాయ్స్​గా పని చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాల గురించి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మాట్లాడటం లేదని అన్నారు. ధరణి పోర్టల్ చూసి తెల్లారేసరికి భూములు లాక్కుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ ప్రపంచ ఖ్యాతి గడించిందని.. ఇంకా ముందుకెళ్లాలంటే హింస, ద్వేషంతో సాధ్యం కాదని అన్నారు. ప్రేమతోనే తెలంగాణ, హైదరాబాద్ ముందుకెళ్తుందని.. అది ఇక్కడి డీఎన్ఏలో ఉందని చెప్పుకొచ్చారు.

భాజపా, కేసీఆర్ వేర్వేరు కాదన్న రాహుల్ గాంధీ.. ఎన్నికల ముందు కేసీఆర్ డ్రామా చేస్తారని వ్యాఖ్యానించారు. మోదీ, కేసీఆర్ మధ్య డైరెక్ట్ లైన్ ఉందని.. ప్రధాని చెప్పినట్లే చేస్తారని ఆరోపించారు. భాజపా అన్ని బిల్లులకు మద్దతు పలికిన తెరాస.. పార్లమెంట్​లో ప్రతిపక్షాలు ఒక అంశాన్ని తీసుకొస్తే ఆ పార్టీ మరొక అంశాన్ని తీసుకొస్తుందని అన్నారు. ధనవంతులు, మిత్రుల కోసమే కేంద్రం పని చేస్తోందన్న విషయం దేశం మొత్తానికీ తెలుసన్న ఆయన.. సిలిండర్, పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పేదరికం, పెరిగిన ధరల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. రూ.25 వేల రుణం కట్టని రైతులను బేడీలు వేసి జైలుకు పంపుతారని, అదే పెద్దవాళ్లు రుణాలు చెల్లించకపోతే మాఫీ చేస్తారని రాహుల్ అన్నారు. రెండు భారతదేశాలను చూస్తున్నామని వ్యాఖ్యానించిన ఆయన.. అందుకే తాను భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. అన్ని సంస్థలను కేంద్రం తెగనమ్ముతోందని.. హైదరాబాద్ విమానాశ్రయం ఇంకా వారి చేతుల్లోకి ఎందుకు పోలేదని ఉదయమే రేవంత్ రెడ్డిని అడిగినట్లు రాహుల్ తెలిపారు.

విద్వేషాలు సృష్టిస్తూ ప్రధాని నరేంద్రమోదీ, భాజపా, ఆర్​ఎస్​ఎస్​ దేశాన్ని దోచుకుంటున్నారన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. 13 లక్షల ఉద్యోగాలు దేశంలో ఖాళీగా ఉంటే అబద్దాలు చెబుతూ యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయనందుకే యువత రోడ్లపైకి వచ్చి రాహుల్​కు సంఘీభావం పలుకుతోందని చెప్పారు. రూ.2 కోట్లతో మరమ్మతులు చేసిన వంతెన గుజరాత్​లో రెండు రోజుల్లోనే కూలిపోయిందన్న ఖర్గే.. మోదీ చెప్పే అబద్ధాలను సమర్థిస్తే దేశం నాశనమవుతుందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ లేకపోయి ఉంటే మోదీ ప్రధాని అయ్యేవారా అని ప్రశ్నించారు. ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. దేశం ముందుకు వెళ్తుందా? వెనక్కు పోతుందా ఆలోచించుకోవాలన్నారు. మోదీ, షా కలిసి ఇద్దరు ధనవంతులకు అన్నీ అమ్ముతున్నారని.. గాలిని మాత్రేమే వదిలిపెట్టారని, అవకాశం ఉంటే దానిపై కూడా పన్ను వేస్తారని ఎద్దేవా చేశారు. మోదీని తప్పించి దేశాన్ని కాపాడకపోతే మళ్లీ గులాంలు అవుతామని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ సంస్కృతి అందరూ కలిసి మెలిసి నివసించేలా ఉంటుందన్న ఖర్గే.. తెలంగాణ రాష్ట్ర కలను సోనియా నెరవేర్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వల్లే కేసీఆర్​కు అధికారం వచ్చిందని.. ఇప్పుడు ఆ కాంగ్రెస్​ను తక్కువ చేసి చూస్తున్నారని అన్నారు. మోదీ, కేసీఆర్ మధ్య తేడా లేదన్న ఆయన.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి నేతలను కలుస్తున్న కేసీఆర్ ముందు సొంతిళ్లు చక్కబెట్టుకోవాలని సూచించారు. భాజపాయేతర ప్రభుత్వాన్ని తీసుకొచ్చేది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాత్రమే అన్న ఏఐసీసీ అధ్యక్షుడు.. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజానీకం, యువత రాహుల్​కు ఘనస్వాగతం పలికిందన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. నరేంద్రమోదీ విభజన వాదాన్ని తిప్పికొట్టేలా భారత్ జోడో యాత్ర కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ బిడ్డ మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా తొలిసారి హైదరాబాద్​కు రావడం సంతోషకరమని అన్నారు. రాహుల్ యాత్ర అందరినీ జోడిస్తూ సాగుతోందన్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. దేశ సంపద అందరికీ సమానంగా చెందాలన్నదే కాంగ్రెస్ ధ్యేయమని తెలిపారు. తెరాస అవినీతి, అక్రమాలపై మనందరం పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇవీ చూడండి..

Bharat Jodo Yatra in Hyderabad: కట్టుదిట్టమైన భద్రత నడుమ భారత్ జోడో యాత్ర

'అలా చేయకపోతే దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.