అధికార తెరాస అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలంటూ రహమత్నగర్ అభ్యర్థి నారాయణరెడ్డి ముమ్మరంగా డివిజన్లో పర్యటించారు. అభివృద్ధి చేస్తున్న తెరాసకే పట్టం కట్టాలంటూ ఓటర్లను కోరారు.
గ్రేటర్లోనే రహమత్నగర్ డివిజన్ను ఆదర్శంగా తీర్చదిద్దుతానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. బల్దియా ఎన్నికల్లో తాము భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లో బడుగు బలహీన వర్గాల కోసం, ప్రతి సమస్యను పరిష్కరించేదుకు చొరవ చూపుతానని నారాయణరెడ్డి వెల్లడించారు.