Raghunandan Rao on Kaleshwaram Project Corruption : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు. మోదీకి లేఖ రాస్తే సీబీఐతో విచారణ జరిపించే విషయంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో సమీక్ష నిర్వహిస్తే అసలు దోషులు బయటపడతారని అన్నారు. అన్ని సాక్ష్యాధారాలతో కాళేశ్వరం ప్రాజెక్టులో మెగా కంపెనీ(Mega company in Kaleswaram project) చేసిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(Raghunandan Rao on Revanth Reddy) కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు.
"కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై 2008 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సమీక్ష జరిగింది. నాడు రూ.17,800 కోట్లతో 160 టీఎంసీలతో ప్రాజెక్టుకు ప్రతిపాదన జరిగింది. 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక చేశారు. దీంతో పాటు 2 లక్షల ఎకరాల ఆయకట్టు పెంచేలా మరోసారి ప్రతిపాదన చేశారు. మరో 20 టీఎంసీలు పెంచి రూ.38 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పనుల కోసం గుత్తేదారులకు రూ.11 వేల కోట్లు చెల్లింపులు జరిగాయి." - రఘునందన్ రావు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే
Legal Notices To MLA Raghunandan Rao : ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు
Raghunandan Rao Comments on KCR Govt : 2016లో కేసీఆర్ హయాంలో ప్రాజెక్టు డిజైన్ మార్చారని రఘునందన్ రావు మండిపడ్డారు. రూ.63 వేల కోట్లతో ప్రాజెక్టు డీపీఆర్‌కు ప్రతిపాదనలు పెట్టారని ఆరోపించారు. తర్వాత ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.05 కోట్లకు పెంచిందని చెప్పారు.
"జూన్ నాటికి రూ.1.49 లక్షల కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా మెఘా కంపెనీకి రూ.48 వేల కోట్లు లబ్ధి జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం(Revanth Reddy oath) చేసిన రోజే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాస్తారనుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి మేడిగడ్డనే తెరమీదకు తీసుకువస్తున్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని పైసాతో సహా బయటపెట్టాలి. దీనికి కేంద్రం సాయం తీసుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తాం." అని రఘునందన్ రావు అన్నారు.
అప్పుడేమో విమర్శలు.. ఇప్పుడు చిలక పలుకులా : రఘునందన్ రావు
మోదీపై విమర్శలను ఖండించిన రఘునందన్.. రేవంత్‌రెడ్డికి సవాల్..