ETV Bharat / state

భవిష్యత్‌లో 3 కమిషనరేట్ల సీసీ కెమెరాల అనుసంధానం: సీపీ - Rachakonda CP who launched CCTV cameras

హైదరాబాద్ సరూర్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని వైశాలినగర్‌లో 42సీసీ కెమెరాలను సీపీ మహేశ్‌భగవత్‌ ప్రారంభించారు. కాలనీవాసుల సంక్షేమసంఘం ఆధ్వర్యంలో రూ. 5లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలోసీసీ కెమెరాల అనుసంధానమవుతాయని సీపీ పేర్కొన్నారు.

rachakonda cp
భవిష్యత్‌లో 3 కమిషనరేట్ల సీసీ కెమెరాల అనుసంధానం: రాచకొండ సీపీ
author img

By

Published : Dec 21, 2020, 5:39 PM IST

భవిష్యత్‌లో 3 కమిషనరేట్ల సీసీ కెమెరాల అనుసంధానం: రాచకొండ సీపీ

సీసీ కెమెరాల ఏర్పాటుతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషరేట్ల పరిధిలో నేరాల సంఖ్య తగ్గిందని రాచకొండ కమిషనర్ మహేశ్​ భగవత్ పేర్కొన్నారు. హైదరాబాద్ సరూర్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని వైశాలినగర్​లో... కాలనీవాసుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐదు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన... 42 సీసీ కెమెరాలను సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.

భవిష్యత్​లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ కమాండ్ కంట్రోల్​ కంట్రోలింగ్​కు ఈ మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాలన్ని అనుసంధానమవుతాయని సీపీ వెల్లడించారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో ఆరున్నర లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు అయ్యాయని వాటిని 10 లక్షలకు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్​ ఎంపీ రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథం ఎల్బీనగర్ డీసీపీ, ఏసీపీలు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.