రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన మహీంద్ర లాజిస్టిక్ ఎలైట్ రవాణా సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఏప్రిల్ 7న రాచకొండ పోలీసులు, మహేంద్ర లాజిస్టిక్ ఎలైట్ సంస్థ రెండు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రానికి నెల రోజుల్లో 358 కాల్స్ ప్రజల నుంచి వచ్చినట్లు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. మహీంద్రా ఎలైట్ సేవలను ప్రశంసించిన ఆయన.. సేవా కేంద్రాన్ని సమన్వయం చేసిన సంస్థకు చెందిన శివాలి, ఎడ్వర్డ్, ఇన్‌స్పెక్టర్ రవిలను కమిషనర్ సత్కరించారు.
"వైద్యేతర, అత్యవసర రవాణా సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ క్యాబ్ సేవలను ప్రజలు విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా డయాలసిస్ రోగులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఈ సేవలను అధికంగా ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ తరహా సేవలు ఏర్పాటు చేశారు. అవసరమైన రోగులకు ఉపయోగపడడం నాకెంతో సంతృప్తినిచ్చింది. "
-మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
ఇదీ చూడండి: 'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'