పుస్తకాలు మనుషులను ఎంతో జ్ఞానవంతులను చేస్తాయి. అలాంటి పుస్తకాలుండే గ్రంథాలయాలను పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు రాచకొండ పోలీసులు శ్రీకారం చుట్టారు. పుణేకు చెందిన జ్ఞాన్ కీ ఎన్జీవో సంస్థ సాయంతో కమిషనరేట్ పరిధిలోని 44 పోలీస్ స్టేషన్లు, 25 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు.
పుస్తక పఠనంతో ఉత్సాహం
ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. నిత్యం తీరిక లేకుండా ఉండే పోలీసులకు ఖాళీ సమయంలో కొన్ని మంచి పుస్తకాలు చదవడం వల్ల మరింత ఉత్సాహంతో పనిచేయడానికి తోడ్పడుతుందన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు వంటివి పుస్తక పఠనం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు.
ఇవీచూడండి: హైదరాబాద్లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్