లాక్‌డౌన్ సడలింపు మినహా మిగతా సమయాల్లో రహదారులపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. హైదరాబాద్ చైతన్యపురిలో పర్యటించిన సీపీ మహేష్ భగవత్ లాక్‌డౌన్ అమలుతీరును పరిశీలించారు.
జాతీయ రహదారిపై ఉన్న దుకాణ సముదాయాలను, రైతు బజార్, మార్కెట్‌ల వద్ద ఉన్న రద్దీని పరిశీలించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని సూచించారు. ఒకవేళ బయకు వచ్చినా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు.
ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో